గొల్ల కురుమల ఆరాధ దైవంగా భావించే బీరప్ప స్వామి కళ్యాణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరయ్యారు. కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గొల్ల కురుమలు పాడిపంటలతో తాము నమ్ముకుని జీవనం కొనసాగించే మేకల గొర్రెల పెంపకం సజావుగా సాగాలని ఎమ్మెల్యే తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జుక్కల్ నియోజకవర్గం లోని మహమ్మద్ నగర్ మండలం గున్కుల్ గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


