Friday, February 13, 2026

దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

బిజెపి ప్రభుత్వం భారతదేశంలో వెలుగులు నింపుతుందని దేశ విదేశాల్లో పేరు ప్రతిష్టలను ఇనుమడింప చేసే విధంగా ప్రధానమంత్రి మోడీ పరిపాలన కొనసాగిస్తున్నారని బిజెపి రాష్ట్ర నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి అభ్యర్థి ధర్మపురి అర్వింద్ కి మద్ధతుగా సోమవారం బోధన్ నియోజకవర్గంలోని నవీపేట్, ధర్మారం,అనంతగిరి,అబ్బాపూర్,గ్రామాలలో కార్నర్ మీటింగ్ నిర్వహించి,ఉపాధి హామీ,కార్మికుల వద్దకు వెళ్లడం జరిగింది.వారితో బోధన్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్,నవీపేట్ మండల అధ్యక్షులు సరిన్, ప్రధాన కార్యదర్శిలు ఆనంద్, రాజేందర్, భూషణ్, బీజేవైఎం మండల అధ్యక్షులు బండారి శేఖర్, మరియు బిజెపి ప్రభుత్వం సీనియర్ నాయకులు,శక్తి కేంద్రం ఇంచార్జ్ లు,బూత్ అధ్యక్షులు,కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular