Friday, February 13, 2026

ఇంటింటికి ప్రచారం నిర్వహించిన కాసుల

జుక్కల్ మండల కేంద్రంలో గుండూర్ తండా,గుండూర్, మైభపూర్, దోస్ పల్లి, బంగర్ పల్లి గ్రామాలు మరియు ఉపాధి హామీ కూలీలకు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షట్కర్ మద్దతుగా రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ గడపగడపకు వెళ్లి సాయంత్రం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని, ఆగస్టు 15 లోపు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అసుపత్వార్ వినోద్,మండల అధ్యక్షుడు సంజు పటేల్, సర్పంచ్ దేవదాస్, షేత్క మారుతి, గణేష్ పటేల్, ప్రకేష్ పటేల్, కంటల్ ఎంపిటిసి దత్తు, విఠల్, మారుతి జ్ఞానేశ్వర్,మధు,రాజు,దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular