ఇంటింటి ప్రచారంలో బీజేపీకి విశేష స్పందన




జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా బీబీ పాటిల్ ను మరో మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి ప్రజలు ఆశీర్వదిస్తే మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తారని బిజెపి పార్టీ కోటగిరి మండల అధ్యక్షుడు ఏముల నవీన్ కోరారు. కోటగిరి మండల కేంద్రంలోని 36,37,38,42,43,44 బూత్ లలో సోమవారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్ళుగా చేపట్టిన అభివృద్ధి పనులు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రాబోయే రోజుల్లో బిజెపి పార్టీ చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటింటి ప్రచారంలో బిజెపి పార్టీకి విశేష స్పందన లభిస్తుందని ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ ఆశయ సాధనకు తమ వంతు సహకారం అందిస్తూ ఓటుతో మోడీకి మద్దతు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బిజెపి కోటగిరి మండల అధ్యక్షులు వివరించారు. కేంద్రంలో ఉన్న నాయకులతో తనకున్న సత్సంబంధాలతో జహీరాబాద్ ఎంపీ గత రెండు దఫాల్లో బిబి పాటిల్ జహీరాబాద్ నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని తెలిపారు. కేంద్రంలో మరోసారి బిజెపి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ప్రజలందరూ ఇది గమనించి బిబి పాటిల్ ను మరో మారు ఆశీర్వదించాలని కోరారు. బిబి పాటిల్ ఎంపీ అయితే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మామిడి శ్రీనివాస్, సాయిలు ,డాన్ రాజు, గాండ్ల శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
