Friday, February 13, 2026

అరవిందుకు ఓటుతో బుద్ధి చెప్పాలి

మల్లాపూర్లో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి కి డప్పు చప్పుళ్ళు..టపాసులు పేల్చి ఘన స్వాగతం.

కాంగ్రెస్ అంటేనే అభివృద్ది.. నిరుపేదల పక్షపాతి.

రైతులను మోసం చేసిన అరవింద్ కు ఓటు తో గుణపాఠం చెప్పాలి,20ఏళ్ల క్రితం కాంగ్రెస్ దేశంలో మొదటిసారిగా ఉచిత విద్యుత్ ప్రవేశ పెట్టింది.ఉచిత విద్యుత్ కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇస్తుంది అని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి.బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇస్తున్నారా అని ప్రశ్నించారు.
రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపి కి ఉందా అని నిలదీశారు.రైతులకు రుణాలు మాఫీ చేస్తే సోమరి పోతులు అవుతారంటు బడా వ్యాపార వేత్తలకు రు.16 లక్షల కోట్లు మాఫీ చేశారు.యూరియా సంచిని 50 కిలోల నుండి 40 కిలోల కు తగ్గించి, మోడీ రైతులను దొంగ దెబ్బ తీశారు.
మోడీ రైతుల ఆదాయం రెటింపు చేస్తాం అని చెప్పి, పెట్టుబడి వ్యయం పెంచారు. రైతులకు మోడీ ప్రభుత్వం కేవలం ఐదు ఎకరాలకు ఆరు వెలు ఇస్తుంది.ఖరీఫ్ పంట నుండి కాంగ్రెస్ పార్టీ ఏటా 50 వెలు ఇస్తుంది.మోడీ ఉపాధి హామీ పథకానికి ఏటా నిధులు తగ్గిస్తూ నిర్వీర్యం చేస్తున్నారు.
కాంగ్రెస్ ఉపాధి హామీ పథకానికి లక్ష కోట్లు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు.అరవింద్ పసుపు బోర్డు ఐదు రోజుల్లో తెస్తామని చెప్పి ఐదెల్లు గడిచింది.
ఎంపీ గెలిచిన తర్వాత ఆరు నెలల్లో నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు.తాను చట్టసభల్లో ప్రశ్నించనీ అంశం లేదు..అని గుర్తు చేశారు.అరవింద్ రైతుల గురించి ఏనాడైనా పార్లమెంట్ లో మాట్లాడారా.. అని ప్రశ్నించారు.చక్కర కర్మాగారం కాంగ్రెస్ పార్టీ ప్రారంభిస్తే బీఆర్ఎస్ మూసి వేసింది.
ఏడాదిన్నర లో చక్కర కర్మాగారం పునః ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.బోధన్, మెట్ పల్లి, సారంగా పూర్, చక్కర కర్మాగారం పునః ప్రారంభిస్తం.
దేశంలో 66 పరిశ్రమలు ప్రారంభించినం అని చెప్పుకుంటున్న అరవింద్
చక్కర కర్మాగారం ఎందుకు పునః ప్రారంభం చేయలేదు..అని నిలదీశారు.
బిజెపి రాష్ట్రంలో ఎక్కడైనా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారా.ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారా.
గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు యదావిధిగా అమలు చేస్తూ, నూతన పథకాలు అమలు చేస్తాం.ఇల్లు లేని నిరుపేదలకు నియోజక వర్గానికి 3500 చొప్పున ఐదేళ్ల లో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తాం..
దసరా నాటికి పెన్షన్ 2000 నుండి 4000 అందిస్తాం.
పీఎఫ్ ఉన్న ప్రతి బీడి కార్మికులకు పెన్షన్ అందిస్తాం..
గల్ఫ్ కార్మికుల కుటుంబాలను కేంద్రం ఒక్కరికీ కూడా సాయం అందించలేదు.గల్ఫ్ మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డీ రు.5 లక్షలు ఆర్థికసాయం అందిస్తాం.గల్ఫ్ కార్మికులు రెండు లక్షల కోట్లు విదేశీ మారక ద్రవ్యం సమకూర్చారు .
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది..కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తె అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.జగిత్యాల లో మామిడి మార్కెట్ ఏర్పాటు చేశానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.రైతుల పక్షాన నిలిచిన పోరాటం చేశాను.మోడీ పదేళ్ల 20కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 7 లక్షలు భర్తీ చేశారు.ఉపాధి హామీ కి గ్యారంటీ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే.కాంగ్రెస్ పార్టీ పాలనలో మాత్రమే అభివృద్ధి జరిగింది.ప్రజలు అండగా నిలిచి ఎం పీ గా గెలిపించాలని జీవన్ రెడ్డి కోరారు.

పదేళ్ల లో బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు మంజూరు ఇవ్వలేదన్నారు.
మాటలు చెప్పడం మినహా చేసిన అభివృద్ధి ఏమి లేదనీ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.అభివృద్ధికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ.అరవింద్ ఎక్కడికి రాడు. .ప్రజల అవసరాలు తీర్చడు..అభివృద్ది చేయడు జై శ్రీరామ్ అంటడు.చేసిన అభివృద్ది ఏమీ లేక రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు.శ్రీరాముడు అందరి దేవుడు.దేవుడు గుడి లో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి.ఐదేళ్ల లో అరవింద్ ఎప్పుడైనా గ్రామానికి వచ్చిండా.. సమస్యలు పరిష్కరించారా..అని నిలదీశారు.సీఎం రేవంత్ రెడ్డి నాలుగు నెలల్లో పాలనలో ఆరు గ్యారంటీ ల్లో ఐదు అమలు చేశామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దే అని అన్నారు.ప్రజల సమస్యలు తెల్సుకునెందుకు ప్రజా పాలన లో దరఖాస్తులు స్వీకరించినం
200 వరకు విద్యుత్ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం.
జీరో బిల్లు వస్తుందా లేదా
సిలిండర్ రు.500 లకు అందిస్తున్నాం.ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేస్తాం.వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించినం.
ప్రతి నియోజక వర్గానికి 3500 ఇళ్లు నిర్మాణం చేపడుతామని అన్నారు.వరికి మద్దతు ధర కు క్వింటాల్ కు బోనస్ రు.500 అందిస్తాం.పంట భీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి, పంట నష్టానికి పూర్తి స్థాయిలో పరిహారం అందిస్తాం..మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం.ఐదేళ్ల లో ఒక్కరూపాయి అయిన అభివృద్ది కి నిధులు కేటాయించలేదు.ఉపాధి హామీ కూలీలకు రోజు వారి వేతనం రు.400 లు అందిస్తాం.
కుల గణన చేపడతాం..కులాల వారీగా నిధులు కేటాయించి అభివృద్ది చేస్తాం.
మోడీ కుల గణన ను అడ్డుకుంటున్నారు.
అన్ని పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరా గాంధీ నిజమైన దేశభక్తురాలు.
బిజెపి నాయకులు ఎవరైనా దేశం కోసం ప్రాణాలు అర్పించారా అని భూపతిరెడ్డి ప్రశ్నించారు.బీజేపీని గెలిపిస్తే రిజర్వేషన్ తొలగించాలని కుట్ర చేస్తుంది.బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మోరిలో వేసినట్లే.మచ్చ లేని నాయకుడు..అందరి తరపున పార్లమెంట్ లో కొట్లాడే జీవన్ రెడ్డి ని గెలిపించాలి అని పిలుపునిచ్చారు.ఇండియా కూటమి అధికారం లోకి రానున్నది.జీవన్ రెడ్డి కి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే భూపతి రెడ్డి పిలుపు నిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular