ప్రజల్లో మార్పు మొదలైంది మళ్లీ కేసిఆర్ రావాలని కోరుకుంటున్నారు.






పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు ఖాయమని నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా అన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ని రోడ్లో గల జనార్దన్ గార్డెన్లో మాజీ శాసనసభ్యులు పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి మాజీ శాసనసభ్యులు గణేష్, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మరియు రాజ్యసభ సభ్యులు శ్రీ సురేష్ రెడ్డి హాజరై మాట్లాడారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. రూ.200 ఉన్న పెన్షన్ రూ .2000 చేశారు. కళ్యాణ లక్ష్మి 50 వేల నుంచిరూ. 1 లక్ష,16 రూపాయలు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదు. టిఆర్ఎస్ పార్టీకే ఎందుకు ఓటు వేయాలంటే అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రజలను ఆదుకున్నది కెసిఆర్ ప్రభుత్వమే ,ప్రజలను మోసం చేసి గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు పెన్షన్, కళ్యాణ లక్ష్మి దిక్కులేదు. కానీ కల్యాణ లక్ష్మి రూ.1 లక్ష,16తో పాటు తులం బంగారం ఇస్తానని అబద్ధాలు చెబుతున్నారు.
ఆరు గ్యారెంటీ ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అబద్ధాలకు ప్రజలు నాతో పాటు ఎంతోమంది ఎమ్మెల్యేలను పోగొట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు లేక కరెంటు లేక తీవ్ర అవస్థలకు ప్రజలు గురవుతున్నారు.
రైతులు పండించిన పంటలు ఎండిపోతున్నాయి, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో గెలిచి అందులో ఫ్రీ బస్సు తప్ప ఇప్పటివరకు ఏది అమలు చేయడం లేదు. మార్పు రావాలి మార్పు రావాలి అంటే నీళ్లు కరెంటు లేక మార్పు తీసుకురావడంపై ప్రజలు మండిపడుతున్నారు.
మళ్లీ మార్పు రావాలని ప్రతి గ్రామాల్లో ముఖ్యమంత్రి గా కేసీఆర్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే అట్ట అడిగిన నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అందాయి.
బాజిరెడ్డి గోవర్ధన్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు ఎంతో అనుభవం ఉంది చాలా సీనియర్ నాయకుడు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించి పంపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పుడు ఆగస్టు 15న చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు. లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు బాసర అమ్మవారి మీద ఒట్టు అని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు.
పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే డ్రామా చేసి గెలవాలని ఉద్దేశంతో ఇలాంటివి చేస్తున్నారు.కావున ప్రజలు ఈ నాలుగు నెలల్లో వచ్చిన మార్పును గమనించి బిఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి.అనంతరం మేయర్ జన్మదినం సందర్బంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్,నగర అధ్యక్షులు సిర్ప రాజు, నాయకులు సుజాత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి,సుదాం రవిచందర్,ఎనగందుల మురళి తదితరులు పాల్గొన్నారు.
