బాన్సువాడ లో 108 అడుగుల హనుమాన్ విగ్రహా ఏర్పాటు

భారతదేశంలో ఎక్కడా 108 అడుగుల హనుమాన్ విగ్రహం లేదు. మొదటిసారిగా బాన్సువాడ లో నిర్మిస్తాము.
పోచారం భాస్కర్ రెడ్డి.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ కి మద్దతుగా ఈరోజు బాన్సువాడ గ్రామీణ మండలం రాంపూర్, పులికుచ్ఛ తాండా, రాంపూర్ తాండా గ్రామాలలో ప్రచారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు డి అంజిరెడ్డి ,బాన్సువాడ మండల వైస్ ఎంపీపీ హరి సింగ్ , మండల పార్టీ అధ్యక్షుడు మోహన్ నాయక్ , నాయకులు దొడ్ల వెంకట్రామిరెడ్డి , దేశాయ్ పెట్ సొసైటీ వైస్ ఛైర్మెన్ అంబర్ సింగ్ , స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు.
ఈసందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి ప్రసంగిస్తూ
మా బలం,మా బలగం,మా గుండె దైర్యం మీరే..
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయింది, ఇప్పటి వరకు రైతులకు, పేదలకు ఎలాంటి సహాయం అందలేదు.నాలుగు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలలో బాన్సువాడ నియోజకవర్గం నుండి పోచారం శ్రీనివాసరెడ్డి కి మంచి మెజారిటీ ఇచ్చారు.అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ కి కూడా మనమందరం మద్దతు తెలిపి మంచి మెజారిటీతో గెలిపించాలనీ పోచారం భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు.
మన బాన్సువాడ నియోజకవర్గంలో పార్టీ గెలిచినా రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయింది. డిసెంబర్ 9న అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఎవరికైనా వచ్చిందా అని రైతన్నలను అడుగుతున్నా. రైతుబంధు ఎకరాకు రూ. 15,000, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000, వరి పంటకు క్వింటాలుకు రూ. 500 బోనస్,18 ఏళ్ళు దాటిన మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇయ్యలేదు.అదేవిధంగా ఆసరా పెన్షన్ రూ. 4000 కు పెంచుతామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000 ఇస్తామన్నారు. 24 గంటల కరంటు ఇస్తామన్నారు.
సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ ఇస్తాం, 200 యూనిట్ల వరకు కరంటు ఫ్రి అన్నారు. ఏవి లేవు.
స్కూళ్ళు, కాలేజీ లకు వెళ్ళుతున్న విద్యార్ధినులకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు.
వాళ్ళు అమలు చేస్తున్న ఏకైక హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఖర్చు రోడ్డు రవాణా సంస్థ భరిస్తుంది. ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంతో ప్రభుత్వానికి ఖర్చు లేదు, ఉద్దెర పథకం అన్నమాట.
రోడ్డు రవాణా సంస్థ కి నష్టాలు వస్తున్నాయనే సాకుతో ఎన్నికలు అనంతరం ఈ ఉచిత ప్రయాణంను ఎత్తివేస్తారు.
రద్దీకి అనుగుణంగా అవసరమైనన్ని బస్సులను ఏర్పాటు చేయకపోవడంతో ప్రస్తుతం మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. సీట్ల కోసం నిత్యం గొడవలు జరుగుతున్నాయి.మగవాళ్ళు డబ్బులు పెట్టి టిక్కెట్ కొనుక్కుని ఎక్కితే సీట్లు ఉండడం లేదు.ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డరు.ఉచిత ప్రయాణం పథకంతో బస్సులలో రద్దీ పెరుగుతదని తెలిసినా బస్సుల సంఖ్యను పెంచడం లేదు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం కింద లక్షా నూటపదహార్లతో పాటుగా తులం బంగారం ఇస్తామన్నారు, ఇప్పటి వరకు ఇత్తడి కూడా లేదు.కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు పేదలకు ఠంచనుగా పెన్షన్లు వచ్చేవి. రైతుబంధు డబ్బులు సమయానికి రైతుల బ్యాంకు అకౌంట్లలో వేసేవారు. పెళ్ళైన రెండు నెలలోనే కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం లక్షా నూటపదహార్లు అందేవి. 24 గంటల కరంటు ఉండేది, ఏనాడు పంటలు ఎండిపోలేదు.
ఈ యాసంగిలో రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాల పంటలు ఎండిపోయాయి.ఉన్న నీటిని సక్రమంగా వాడుకునే తెలివి లేక పంటలు ఎండబెట్టారు.
ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్ నాయకులకు చేతకావడం లేదు. ప్రజల జీవితాలలో మన్ను పోస్తున్నారు.
ఆగస్టు 15 లోగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినా దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నడు.
మీకు మనసులో నిజంగా ఇచ్చే ఉద్దేశ్యమే ఉంటే దేవుళ్ళ మీద ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. దేవుళ్ళను కూడా మోసం చేస్తున్నడు.సంవత్సరం నాది కాదు అనుకుంటే, నలబై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు.
అంటే ఆయన అవినీతి పరుడు అని ముఖ్యమంత్రే ఒప్పుకున్నాడు.సంపాయించడానికి, కొల్లగొట్టడానికి ముఖ్యమంత్రి అయిండా ?
బిఆర్ యస్ ప్రభుత్వంలో పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నియోజకవర్గంలో 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళను పేదలకు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అయిదు లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు, ఒక్కటి కూడా ఇవ్వలేదు.కాంగ్రెస్ పార్టీ నుండి బాన్సువాడ నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తున్న వ్యక్తి అంతకు ముందు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంచి పనులు చేయలేదు కాబట్టే అక్కడి ప్రజలు తరిమారు.
ఇక్కడ గ్రూపులతో గొడవలు పడుతున్నారు. గిరిజన జడ్పిటిసి ని తిట్టాడు.
బిజేపీ పార్టీ మతం పేరుతో రాజకీయాలు చేస్తుంది.
ప్రతి వ్యక్తి బ్యాంకు అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తా, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని మోడీ అన్నడు ఏది లేవు. ఏమైనా అడిగితే జై శ్రీరాం అంటారు, మనమందరం కూడా హిందువులమే కదా. నేను హనుమాన్ భక్తుడినే, రాముడు కేవలం బిజెపి పార్టీ నాయకులకే స్వంతమా ?. మొన్న శ్రీరామనవమిని మనమందరం మంచిగా చేసుకున్నాం.పోచారం శ్రీనివాసరెడ్డి తిమ్మాపూర్ దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ప్రతి గ్రామంలో దేవాలయాలు, మజీద్ లు, చర్చిల నిర్మాణానికి నిధులు ఇచ్చారు. వచ్చే హనుమాన్ జయంతి నాటికి బాన్సువాడ లో 108 అడుగుల హనుమాన్ విగ్రహా ఏర్పాటుకు శంఖుస్థాపన చేస్తాము. భారతదేశంలో ఎక్కడా 108 అడుగుల హనుమాన్ విగ్రహం లేదు. మొదటిసారిగా బాన్సువాడ లో నిర్మిస్తాము.
పదేళ్ళు పార్లమెంట్ సభ్యులుగ గా పనిచేసి ఇప్పుడు బిజెపి అభ్యర్థిగా ఉన్న బిబి పాటిల్ బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు తేలేదు.
అంతకు ముందు అయిదేళ్ళు పార్లమెంట్ సభ్యులు గా పనిచేసిన కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షెట్కార్ కూడా ఏం పని చేయలేదు.పదిహేను సంవత్సరాలు ఏ పని చేయని వాళ్ళకు మనం ఎందుకు ఓటు వెయ్యాలి.గాలి అనీల్ కుమార్ బిసి బిడ్డ. అందరం కలిసి బలహీన వర్గాల బిడ్డను బారీ మెజారిటీతో గెలిపించాలి. అప్పుడే యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
అందరం కారు గుర్తుపై ఓటు వేసి పార్టీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ ని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి.
