కాంగ్రెస్ పార్టీ పటిష్టత తన లక్ష్యంగా పనిచేసిన ఓ సామాన్య వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది. అధికారమే పరమాదిగా భావించే ఈ రోజుల్లో కోటగిరి మండల కేంద్రం చెందిన ఆనంద్ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఆనాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ అంటిపెట్టుకుని ఉన్నారు. పార్టీ పటిష్టతకు కృషి చేసిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ సైతం మరువకుండా ఆదరిస్తుంది. కోటగిరి గ్రామానికి చెందిన ఆనందనం కోటగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎన్నుకున్న ఆనంద్ ను గ్రామ మాజీ సర్పంచ్ స్వరూప గంగాధర్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పార్లమెంట్ ఎన్నికల్లో కోటగిరి గ్రామంలో నుండి మెజార్టీ ఓట్లను కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో మైనార్టీ జిల్లా కార్యదర్శి వహీద్ హుస్సేన్ ,యాయా ఖాన్, హైమద్,నజీర్ తదితరులు పాల్గొన్నారు.
