రక్తదానం చేయడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని మరోపక్క ప్రమాదంలో ఉన్న వ్యక్తులను కాపాడటం ఎంత గొప్ప విషయం అని, ప్రపంచంలో డబ్బులతో ఎన్నో వస్తువులను కొనుగోలు చేయవచ్చని రక్తాన్ని మాత్రం కొనలేమని రక్తానికి విలువ కట్టలేమని ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు.ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మొహరిల్ శ్రీనివాస్ రావు పుట్టినరోజు పురస్కరించుకొని బ్లడ్ బ్యాంక్ సెంటర్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి భారీ ఎత్తున స్పందన లభించింది.
ఫౌండేషన్ చైర్మన్ మోహరిల్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో ఎండ తీవ్రతను లెక్క చేయకుండా వివిధ మండలాల నుండి ఫౌండేషన్ సభ్యులు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని, మాత శిశు సంక్షేమ ఆసుపత్రిలో ఉన్న గర్భిణీ స్త్రీలకు రక్తం ఇప్పుడు అత్యంత అవసరమని ,ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసినట్లయితే రెండు ప్రాణాలను కాపాడినవారవుతారని,రక్తదానం చేసి ప్రాణధాతలు అవ్వాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయ్యల సంతోష్, ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బంగారు రవి,వాసరి సతీష్,అజీమ్,తుల శ్రీనివాస్,గటాడి సాయికుమార్,సంధుల సంజీవ్,బొప్పని శ్రీనివాస్,కల్లేటి సాయిలు,గజనంద్ గౌడ్,సాయి ప్రసాద్, రాందాస్ గౌడ్,అంజు,గోపాల్,శ్రీధర్ గౌడ్,మహేష్, పండరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రక్తదానం మరో ప్రాణికి ఆయువు
RELATED ARTICLES
