Friday, February 13, 2026

దేశ ప్రగతి మోడీతోనే సాధ్యం

మోడీ ని మరోసారి ప్రధాని చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. పసుపు రైతులు సంఘం నాయకులు కోటపాటి నరసింహా నాయుడు

భారతదేశ ప్రగతి మోడీ తోనే సాధ్యమని దేశ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలు కూడా ఆలోచన చేసి మోడీని సమర్థించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ ను గెలిపించాలని కోటపాటి పిలుపునిచ్చారు. వర్ని మండల కేంద్రంలో బిజెపి నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోటపాటి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎన్నో మార్లు పోచారానికి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు, నిన్నటి వరకు టిఆర్ఎస్ పార్టీ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అండగా ప్రజలు నిలబడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైతం తెలుగుదేశం పార్టీ బిజెపి వారి మిత్రపక్షంగా ఎన్నికల్లో పోటీకి దిగాయని, ఈ ప్రాంతంలోని వారు బిజెపికి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో చాటిచెబుతున్న ఘనత మోడీకే దక్కిందన్నారు. మరో ఒకసారి దేశ ప్రజలందరూ బిజెపిని సమర్థించి మోడీని ప్రధానమంత్రి చేస్తే మన దేశ భవిష్యత్తు మరింత ముందుకు సాగుతుందన్నారు. ఈ ప్రాంతంలో రైతులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఈ ప్రాంతంలో పార్టీ అభ్యర్థి గెలిస్తే ఈ ప్రాంతా అభివృద్ధికి తన వంతు కృషి కూడా చేస్తానని ఆయన అన్నారు. ఆంధ్రుల సైతం ఒకసారి ఆలోచన చేసి పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేసి హిందూ సామ్రాజ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆయన వెంట శేఖర్, దొరబాబు తదితరులు ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular