Friday, February 13, 2026

రెండు కిలోల గాంజా పట్టివేత

ఈరోజు పై కేసు నమోదు రిమాండ్ తరలింపు

రెండు కిలోల వంద గ్రాముల గాంజా పట్టివేత ఇద్దరి పై కేసు నమోదు రిమాండ్ కి తరలింపు

నమ్మదగిన సమాచారం మేరకు నిర్మల్ జిల్లా కి చెందిన ఇద్దరు వ్యక్తులు బాల్కొండ, వేల్పూర్, భీంగల్ మండలాల యువత కి నిషేధిత గాంజా సప్లై చేయడానికి వస్తున్నారు. అనే నమ్మదగిన సమాచారం మేరకు సబ్ ఇన్స్పెక్టర్ వేల్పూర్ తన సిబ్బంది తో కలిసి వెంకటపూర్ రోడ్డు లో ఉన్న సాయి కృష్ణ రైస్ మిల్ దగ్గర వెహికిల్ చెకింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అటుగా వస్తుండగా అనుమానాస్పదం గా కనిపించడం తో వారిని ఆపి వారి దగ్గర ఉన్న సంచిని చెక్ చేయగా అందులో నిషేధిత గాంజా దొరికింది. పంచనామా నిర్వహించి సీజ్ చేసి తూకం వేయగా అది 2 కిలోల 100 గ్రాముల బరువు ఉంది. తరువాత వారిని విచారించగా వారి పేర్లు 1) సయ్యద్ అజీమ్, 30yrs, 2) షేక్ అద్నాన్ సోహెల్ , 20yrs, ఇద్దరు నిర్మల్ కి చెందిన వారు అని తెలిపి వీరు కొన్ని రోజులు గా బాల్కొండ, వేల్పూర్, భీంగల్ మండలాల యువత ని టార్గెట్ చేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే దురుద్దేశం తో మహారాష్ట్ర నుండి గంజాయి ని తక్కువ రేటు కి కొనుక్కొని వచ్చి ఇక్కడ వారికి ఎక్కువ రేటు కి అమ్ముతున్నాము అని నేరం ఒప్పుకున్నారు.వారిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. వేల్పూర్ మండల యువత కి తెలియచేయునది ఏమనగా గంజాయి తాగడం కూడా చట్ట రిత్యా నేరము వారిపై కూడా కేసులు నమోదు చేయబడతాయి అని పోలీసులు హెచ్చరించారు. చెడు అలవాట్ల కు బానిస అయి కేసుల్లో ఇరుక్కుని భవిష్యత్ నాశనం చేసుకోవద్దు అని హెచ్చరిస్తున్నాము. వినయ్ సబ్ ఇన్స్పెక్టర్ వేల్పూర్, భాస్కరా చారి, సబ్ ఇన్స్పెక్టర్ ముప్కాల్, సిబ్బంది విజయ్, సందీప్, శ్రావణ్, భరత్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular