Friday, February 13, 2026

కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తా జుక్కల్ ఎమ్మెల్యే

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి జుక్కల్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేసి తీరుతానని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు స్పష్టం చేశారు. మంగళవారం నియోజకవర్గంలోని గ్రామాలను ఎమ్మెల్యే సందర్శించారు. తక్కడపల్లి గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పలువురు ఇతర పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తామని సంక్షేమ పథకాలను అందించడంతోపాటు గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించి తీరుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే పలు గ్యారంటీ పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే దక్కుతుందన్నారు. భవిష్యత్తులో కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టబోతుందని, రాహుల్ గాంధీ ప్రకటించిన గ్యారెంటీ పథకాలను రాష్ట్రంలోనూ అమలు చేసి తీరుతామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించి కెసిఆర్ అప్పుల పాలు చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంద ని అయినప్పటికీ ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా మా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని ప్రజలకు వివరించారు. ప్రజలు సొంత ఓపిక పడితే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేసి తీరుతామని, ఆగస్టు 15 లోపు రైతు పంట రుణాలను మాఫీ చేసి తిడతామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరి పెత్తనం కొనసాగదని ప్రతి నాయకుడికి స్వేచ్ఛ ఉంటుందని ప్రజలు సమస్యలు వివరించేందుకు ఎప్పుడైనా ఎవరైనా ప్రజాప్రతినిధులను కలవవచ్చానీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular