కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో మరికొన్ని నూతన హామీలు
*మేనిఫెస్టో ద్వారా మహిళలంతా తెదేపా కూటమికే మద్దతు..ఇస్తారని తెలిపిన రఘురామకృష్ణ రాజు.
వృద్ధాప్య పింఛన్ ఆరంభానికి ఆధ్యుడు చంద్రబాబు నాయుడు… ఇప్పుడు ఏకంగా నాలుగు వేలకు పెంచుతామని హామీ
దీపం పథకం పేరిట మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం .
జగన్మోహన్ రెడ్డి చేయూత పథకం కంటే బెటర్ గా ప్రతి మహిళకు ఏడాదికి 18000
18 ఏళ్ల యువతి నుంచి మొదలుకొని మహిళలందరికీ ప్రతినెలా 1500 రూపాయల అందజేత అమ్మ ఒడి పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఒక్క విద్యార్థికే 13000 రూపాయలు ఇవ్వగా , తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే… అంతమందికి 15 వేల చొప్పున చంద్రబాబు నాయుడు స్కూల్ ఫీజు చెల్లింపు. ప్రతి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండడమన్నది ఖాయమే … ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అమ్మఒడికంటే తల్లికి వందనం ద్వారా డబుల్ అమౌంట్ ఇవ్వనున్న చంద్రబాబు నాయుడు.ఇంటింటికి మంచి నీటి పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయిలతో తాగు నీటి సరఫరా . నరసాపురం ఎంపీ, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు .
తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించిన సూపర్ సిక్స్ తో విక్టరీ ఖాయమని నరసాపురం పార్లమెంటు సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రానికి పట్టిన అరిష్టం, ముద నష్టమైన జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవాలని ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన 6 అంశాలను ప్రజలకు వివరించారు. తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడే వృద్ధాప్య పింఛన్ కు ఆద్యులని గుర్తు చేశారు. వృద్ధాప్య పింఛను తొలుత 1000 రూపాయలు, ఆ తర్వాత రెండు వేల రూపాయలకు ఆయనే పెంచారన్నారు. మధ్యలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కొంచెం పెంచితే, జగన్మోహన్ రెడ్డి గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన దాని కంటే, కొంచెం పెంచి ఇస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోలో వృద్ధాప్య పింఛన్లు దశలవారీగా పెంచుతానని చెప్పారని గుర్తు చేశారు. 2028లో 250 రూపాయలు, 2029లో మరో 250 రూపాయలు పెంచుతానని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్య పింఛన్ ఏకంగా మూడు వేల రూపాయల నుంచి 4 వేల రూపాయలకు పెంచనున్నట్లు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారని గుర్తు చేశారు. ఈ లెక్కన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగేళ్లలో ప్రతి వృద్ధుడికి 48 వేల రూపాయల అదనపు లబ్ధి చేకూరనుందని రఘురామకృష్ణం రాజు వివరించారు. జగన్మోహన్ రెడ్డి దశలవారీగా 2028, 2029లో 250 రూపాయల చొప్పున పెంచేనాటికి, ఎంతమంది వృద్ధులు బ్రతికి ఉంటారో… ఉండరో తెలియదన్నారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన పథకాలకు, జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన పథకాలకు ఉన్న తేడా ఇదేనని గుర్తు చేశారు. అలాగే దివ్యాంగులకు తెదేపా నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరువేల రూపాయల పింఛన్ అందజేయడం జరుగుతుందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి, ఆ పైన వయసున్న ప్రతి ఒక్క మహిళకు నెలకు 1500 రూపాయలను అందజేయనున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే చేయూత పథకం కంటే, ఈ పథకం ఎన్నో రెట్లు ఎక్కువ గా మహిళలకు లబ్ధి చేకూర్చనుందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. రానున్న తెదేపా నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లో ప్రతి మహిళకు ఏడాదికి 18 వేల రూపాయలు అందజేయనుండగా, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 16,500 రూపాయలను మాత్రమే ఇస్తుందన్నారు. అది కూడా 45 ఏళ్ల నుంచి పైబడిన మహిళలకు మాత్రమేనని గుర్తు చేశారు . చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే 18 ఏళ్ల యువతుల నుంచి మొదలుకొని, ప్రతి ఒక్క మహిళకు ఏడాదికి 18 వేల రూపాయలను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ పథకం మహిళలకు అత్యంత సహాయకారిగా ఉండనుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ పథకం తో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్న చేయూత పథకం దేనికి పనికిరాదని చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్న పథకం… ప్రతి మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూర్చే గొప్ప స్కీమ్ అని కొనియాడారు. మహిళలంతా ఈ విషయాన్ని గ్రహించి చంద్రబాబు నాయుడు, తెదేపా నేతృత్వంలోని కూటమికి సంపూర్ణ సహాయ సహకారాల అందించాల్సిన అవసరం స్త్రీగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఉన్నదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. తల్లికి వందనం పేరిట అద్భుతమైన స్కీంను కూటమి ప్రభుత్వం అమలు చేయనుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న అమ్మ ఒడి పథకం ద్వారా ఒక కుటుంబంలో ఒక్క చిన్నారికి మాత్రమే ఏడాదికి 13 వేల రూపాయలను ఇస్తున్నారని తెలిపారు. ఐదేళ్లలో ఒక ఏడాది అమ్మ ఒడి పథకాన్ని అమలు చేయలేదని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే అమ్మ ఒడి పథకాన్ని 15 వేల నుంచి 17వేల రూపాయలకు పెంచుతామని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే 15 వేల రూపాయలను అందజేయనున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ఎంతమంది చిన్నారులు ఉన్నా సరే… అందరికీ ఏడాదికి 15 వేల రూపాయల చొప్పున స్కూల్ ఫీజు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఇంట్లో కనీసం ఇద్దరు చిన్నారులైనా ఉంటారని, ఈ లెక్కన జగన్ మోహన్ రెడ్డి అమ్మ ఒడి ద్వారా అందజేసే మొత్తం కంటే, రెండింతలు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరనుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఇక దీపం అనే పథకం ద్వారా ప్రతి మహిళకు మూడు సిలిండర్లు ఉచితంగా అందజేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారన్నారు. ఈ స్కీంకు జగన్మోహన్ రెడ్డి వద్ద సమాధానమే లేదని చెప్పారు. ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేయడం ద్వారా, ఆయా కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో లబ్ధి చేకూరుతుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు . చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందన్నారు. మహిళలు ఎక్కడికైనా ఉచితంగానే బస్సులలో ప్రయాణం చేయవచ్చునని, బంధుమిత్రులను, కుటుంబ సభ్యులను వెళ్లి కలుసుకునే వెసులుబాటు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా లభించనుందని చెప్పారు. పుట్టింటి వారిని పరామర్శించాలన్న ఈ పథకం ద్వారా మహిళలకు ఎంతో ఉపశమనం లభిస్తుందన్నారు. మహిళలు పుడితే ఇటువంటి గొప్ప, గొప్ప పథకాలను అమలు చేస్తున్న చంద్రన్న రాజ్యంలోనే పుట్టాలని కోరుకుంటారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ప్రతి మహిళా ముక్తకంఠంతో ఈ పథకాలన్నింటికీ మద్దతును ఇచ్చి, ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా కృషి చేయాలని కోరారు. అలాగే చిన్నారులు కూడా తమ తల్లిదండ్రులకు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయనున్న పథకాల గురించి వివరించాలని కోరారు. రైతులకు అన్నదాత పథకం ద్వారా 20వేల రూపాయలను సహాయంగా అందజేయాలని నిర్ణయించినట్లుగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కేంద్రం అందజేస్తున్న ఆర్థిక సహాయంతో కలిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్నది కేవలం 13,500 మాత్రమేనని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు 20వేల రూపాయల ఆర్థిక సహాయం అందనుందని తెలిపారు. అలాగే యువత కోసం 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుందన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నిరుద్యోగ యువతకు యువ గళం నిధి నుంచి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతిని అందజేయడం జరుగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇటువంటి స్కీం ఏదీ లేదన్న రఘురామకృష్ణంరాజు, నిరుద్యోగ యువతీ, యువకులు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ది కోసం, తమ బంగారు భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమిని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలోని వాలంటీర్లు దాదాపు 3 లక్షల మంది ఉంటారని, వారందరికీ తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదివేల రూపాయల గౌరవ వేతనాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. అయితే కొంతమంది వాలంటీర్లు , జగన్మోహన్ రెడ్డి కోసం ఇప్పుడు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారని చెప్పారు. అటువంటి వారిని భవిష్యత్తులో తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడం జరగదని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోలో వాలంటీర్లకు తిరిగి అవే ఐదువేల రూపాయలు ఇస్తామని పేర్కొనడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికి మంచినీటి పథకాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇది చాలా అద్భుతమైన పథకం అని, కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ కి జల్ పేరిట అమలు చేస్తోందని తెలిపారు . ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను కేటాయిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను భరించాల్సి ఉంటుందన్నారు . అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతికి అలవాటు పడిన అధికారులు, గుత్తేదారులు 40 నుంచి 50 శాతం నిధులు అదనంగా పెంచి టెండర్లు దాఖలు చేయడం వల్లే, ఈ పనులు అటకెక్కాయని తెలిపారు. ఉభయగోదావరి జిల్లాలో విద్వేశ్వరం నుంచి పైప్లైన్ వేసి అన్ని గ్రామాలకు కుళాయిల ద్వారా మంచి నీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో వన్ బై వన్ గా ఇంటింటికి కుళాయిల ద్వారా మంచి నీటి సరఫరా పథకాన్ని అమలు చేసుకుంటూ వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఆక్వా హబ్ గా పేరుపొందిన ఉభయగోదావరి జిల్లాలకు ఈ పథకం ఎంతో అవసరమని చెప్పారు. బీసీలు ఎన్నో రకాలుగా వివక్షకు గురవుతున్నారని, రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల సంరక్షణకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారని తెలిపారు. అలాగే పేదింటి ఆడపిల్లల వివాహాల కోసం ఎటువంటి షరతులు లేకుండా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరును, జగనన్న విదేశీ విద్యగా మార్చడం జరిగిందని… ఆ పేరును మార్చి దళిత విద్యార్థులకు విదేశీ విద్యను అందించేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం
అందజేస్తుందన్నారు . గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేలాది మంది దళిత విద్యార్థులకు అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించగా, జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని నాలుగేళ్ల పాటు అటకెక్కించి, చివరి ఏడాది పేరు మార్చి జగనన్న విదేశీ విద్యగా ప్రచారం చేసుకుంటూ… కేవలం కొంతమందికి మాత్రమే సహాయ సహకారాలు అందించారన్నారు. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ చెప్పే జగన్మోహన్ రెడ్డి, తడి గుడ్డతో ఎస్సీల గొంతు కోశారన్నారు. గొర్రె కసాయి వాడినే నమ్ముతుందన్నట్లుగా, ఇంకా కొంత మంది ఎస్సీలు జగన్మోహన్ రెడ్డిని విశ్వసించడం దురదృష్టకరమన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ లోని 27 అద్భుతమైన పథకాలను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేరిట, ప్రతి ఎస్సీ విద్యార్థికి ఏడాదికి 40 నుంచి 50 వేల రూపాయల లబ్ధి చేకూరేదని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి అదే అమ్మ ఒడి పేరిట 13 వేల రూపాయలు ఇచ్చి సరి పెట్టారన్నారు. ఎస్సీలకు చేసినంత అన్యాయం జగన్మోహన్ రెడ్డి మరెవరికి చేయలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయానికి ప్రజలలో ఇప్పటికే పెను మార్పు వచ్చినప్పటికీ, ఎస్సీలలో ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఎస్సీలు జగన్మోహన్ రెడ్డి వెంట ఉండడానికి వేరే కోణం కారణమై ఉండవచ్చునన్న రఘురామకృష్ణం రాజు, పూజించే దేవుడు ఒక్కరైనంత మాత్రాన, ప్రజలను నిలువున వంచిస్తున్న నాయకుడికి మద్దతును ఇవ్వాలనుకోవడం సరికాదన్నారు. జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు విని మోసపోతున్న వారికి ఈ విషయాన్ని విద్యావంతులు, మేధావులు అర్థమయ్యే విధంగా వివరించాలని కోరారు.
గొప్ప అభ్యుదయ భావాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చతుర్ముఖ వ్యూహంతో పలు పథకాలను అమలు చేయాలని నిర్ణయించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అందులో భాగంగా ప్రతి గ్రామంలో ఔత్సాహికులైన యువకులకు పది లక్షల రూపాయల చొప్పున అందజేసి వారిని యువ పారిశ్రామికవేతలుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. ప్రతి యువ పారిశ్రామికవేత్త తాను ఏర్పాటు చేయబోయే సంస్థల్లో పదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా చొరవ తీసుకోవాలన్నారు. ఇంకొక బ్లాక్ బాస్టర్ బోనంజా ఏమిటి అంటే రాష్ట్రంలో నివసించే ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయించాలని నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారని తెలిపారు. ఇది దేశ చరిత్రలో నభూతో న భవిష్యత్తు అనే పథకమని కొనియాడారు. ప్రజల గురించి ఇంత అద్భుతంగా ఆలోచించగలిగిన వ్యక్తిత్వం కేవలం చంద్రబాబు నాయుడుకు మాత్రమే సొంతమని అన్నారు. అభివృద్ధిపై ఆయన ఎంత ఫోకస్ చేస్తారో, ప్రజా సంక్షేమంపై కూడా అంతే దృష్టి సారిస్తారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబ పెద్ద కు ఒక నమ్మకం, ధైర్యం కలుగుతుందని, నాకేమైనా నా కుటుంబం హాయిగా ఉంటుందనేది ధైర్యం కలుగుతుందన్నారు . ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం ముదాహమన్నారు. జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో మద్యనిషేధం అమలు తన సాధ్యం కాదని పేర్కొనగా, సిపిఎస్ రద్దు పై చేతులెత్తేశాడని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలతో పాటుగా, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ లతో పాటు, కూటమి సభ్య పార్టీలైన జనసేన, బిజెపిలు కొత్తగా ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తాయో మరికొన్ని గంటల్లో తెలుస్తుందన్నారు. కూటమి మేనిఫెస్టోకు ప్రజల మద్దతు ఉంటుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. భవిష్యత్తుకు బాబు గ్యారెంటీ అని యువత, విద్యార్థులు, యావత్ సమాజం విశ్వసిస్తుందన్నారు. తెలుగుదేశం మేనిఫెస్టో పాటు, కూటమి ఉమ్మడిగా ప్రకటించే మేనిఫెస్టోను ప్రజల్లోకి, ప్రతి ఇంటికి చేరవేయాల్సిన బాధ్యత కూటమిలోని అన్ని పార్టీల కార్యకర్తలు, నాయకుల పై ఉన్నదన్నారు. దుష్ట జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను సమాజ హితం కోరే ప్రతి ఒక్కరు ప్రజలకు తెలియజేయాలని కోరారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి మాయలో ఉన్న అమాయక ప్రజలకు, అతడు చేసిన అరాచకాలను వివరించి, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా చంద్రబాబు నాయుడు ని ఎన్నుకోవలసిన అవసరాన్ని నొక్కి వక్కానించాలని సూచించారు
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దుష్ట ప్రభుత్వం తీసుకు వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైలెట్ ప్రాజెక్టుగా అమల్లోకి వచ్చిందని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. అయితే ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని వైకాపా నేతలు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువస్తే బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎందుకు అమలు చేయలేదని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. దేశంలోని 18 రాష్ట్రాలలో బిజెపి పాలిత ప్రభుత్వాలు ఉన్నాయని, అక్కడ ఎక్కడా కూడా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో కేంద్ర ప్రభుత్వం అనేక సూచనలను చేసిందని, అయితే అమలు చేసే విచక్షణాధికారాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించిందన్నారు. ప్రజల ఆస్తులను స్వాహా చేయడానికి అలవాటు పడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే, ఈ చట్టాన్ని అమలు చేస్తోందని చెప్పారు. పైగా కేంద్ర ప్రభుత్వమే ఈ చట్టాన్ని అమలు చేస్తోందని వక్రీకరణ భాష్యాలు చెబుతున్నారని రఘు రామకృష్ణంరాజు ధ్వజమెత్తారు. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించడం పట్ల అభ్యంతరాన్ని తెలియజేస్తూ పులివెందులలో ప్రచారం నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డిని భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ప్రశ్నించగా అక్కడి నుంచి ఆమె పలాయణం చిత్తగించారన్నారు. ప్రజలందరిలోనూ ఈ విధమైన చైతన్యం అవసరమని, ప్రజల ఆస్తులపై మరో నెల రోజుల తర్వాత ప్రజలకు కనిపించకుండా పోయే వ్యక్తి ఫోటో అవసరమా? అంటూ ప్రశ్నించారు. జనన మరణ ధ్రువీకరణ పత్రాలపై కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలను ముద్రించడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. కొంతమంది ముఖం చూస్తే అసహ్యం వేస్తుందని, అటువంటి వారి ఫోటోలను మన ఆస్తి పత్రాలపై ఎలా ఉంచుకుంటామని ప్రశ్నించారు.
అంటున్న….రఘురామ కృష్ణం రాజు*
కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో మరికొన్ని నూతన హామీలు
మేనిఫెస్టో ద్వారా మహిళలంతా తెదేపా కూటమికే మద్దతు..ఇస్తారని తెలిపిన ..RRR
వృద్ధాప్య పింఛన్ ఆరంభానికి ఆధ్యుడు చంద్రబాబు నాయుడు… ఇప్పుడు ఏకంగా నాలుగు వేలకు పెంచుతామని హామీ
దీపం పథకం పేరిట మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
జగన్మోహన్ రెడ్డి చేయూత పథకం కంటే బెటర్ గా ప్రతి మహిళకు ఏడాదికి 18000
18 ఏళ్ల యువతి నుంచి మొదలుకొని మహిళలందరికీ ప్రతినెలా 1500 రూపాయల అందజేత
అమ్మ ఒడి పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఒక్క విద్యార్థికే 13000 రూపాయలు ఇవ్వగా ,
తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే… అంతమందికి 15 వేల చొప్పున చంద్రబాబు నాయుడు స్కూల్ ఫీజు చెల్లింపు
ప్రతి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండడమన్నది ఖాయమే … ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అమ్మఒడికంటే తల్లికి వందనం ద్వారా డబుల్ అమౌంట్ ఇవ్వనున్న చంద్రబాబు నాయుడు
ఇంటింటికి మంచి నీటి పథకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయిలతో తాగు నీటి సరఫరా
నరసాపురం ఎంపీ, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు