Friday, February 13, 2026

రాజన్న జిల్లా లో వ్యక్తి దారుణ హత్య?

సిరిసిల్ల జిల్లా
వేములవాడలోఓ వ్యక్తి ఈరోజు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ విషాదకర సంఘటన వేములవాడ పట్టణ శివారులోని చెక్కపల్లిలో మంగళవారం ఉదయం చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.వేములవాడ రూరల్ ఎంపీపీ బండ మల్లేశానికి చెందిన వ్యవసాయ భూమిలో కూలీగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది.ఆవేశానికి గురైన ఓ వ్యక్తి పక్కనే ఉన్న పారతో మర్రిపల్లి రాజయ్య (64) తలపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు జూపల్లి మండలం తేలుకుంటపల్లి వాసిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరు కొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖాన కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular