Friday, February 13, 2026

దేశం అభివృద్ధి చెందాలంటే బిజెపికి ఓటు వేయాలి

మూడోసారి ముచ్చటగా మోడీ ప్రధాని ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ వెల్లడి

భారతదేశం కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింప చేసిన మన దేశ ప్రధాని మోడీ యే నని మూడోసారి ముచ్చటగా మోడీ ప్రధాని కావడం ఖాయమని నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. నిజాంబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర బోధన్ మండలాల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. బోధన్ ఎంపీపీ భర్త గుండెపోటుతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న అరవింద్ వారి ఇంటికి వెళ్లి ఎంపీపీ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చారు. కల్దుర్కి గ్రామంలో కార్నర్ మీటింగ్లో వారి సందేశాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, సుధాకర్ చారి, జిల్లా ఉపాధ్యక్షులు మేక సంతోష్, బోధన అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు ప్రవీణ్, ఇంద్రకరణ్, బాలరాజు, రచ్చ సుదర్శన్, సరే రెంజల్ వైస్ ఎంపీపీ యోగేష్, అశోక్ గౌడ్, ప్రదీప్ గుప్తా, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular