Friday, February 13, 2026

కార్మికులకు కాంగ్రెస్అండ

మేడే ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు

సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా మేడే

ప్రపంచ కార్మికుల దినోత్సవం మైన మేడేను బుధవారం నాడు బాన్సువాడ సిపిఐ కార్యాలయంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మే డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి విచ్చేసి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కార్మికులు సాధించుకున్న చట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ రాజ్యంలో సాధించబడ్డాయని ఆయన తెలిపారు.కార్మికుల కోసం మా ప్రభుత్వం అండగా ఉంటుందని కార్మికుల సమస్యలు ఏవి ఉన్న నా దృష్టికి తీసుకురండి పరిష్కారం చేస్తానని కార్మికులకు హామీ ఇచ్చారు. ఇండియా కూటమిలో సిపిఐ భాగస్వామ్యం ఉందని కలిసి పని చేద్దామని ఆయన తెలిపారు. కేంద్రంలోని బిజెపి కార్మికులకు ప్రజలకు రైతులకు వ్యతిరేక విధానాలతో పరిపాలన చేస్తుందని కార్మిక వర్గం గుర్తించాలని ఆయన తెలిపారు. సిపిఐ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ దుబాస్ రాములు మాట్లాడుతూ ఆనాడు అమెరికాలోని చికాగో నగరంలో 1886సంవత్సరములో కార్మికులు చేసిన వీరోచిత పోరాటంలో అమెరికా దేశం తన పోలీసు బలగాలతో అమానుషంగా కాల్పులు జరిపించిందని ఆయన తెలిపారు. కార్మికుని తడిసిన రక్తం గుడ్డతోనే ఎర్రజెండా పుట్టిందని ఆయన తెలిపారు. కార్మికులు సాధించుకున్న చట్టాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తుందని ఆయన తెలిపారు .రానున్న ఎన్నికలలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించి ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డివిజన్ అధ్యక్షులు డి శంకర్, రేణుక, సరోజ, కళ్యాణి, గంగాధర్, ధనుంజయ్, భూమయ్య, ధర్మం చిన్న సాయిలు, గంపల సాయిలు, రాపర్తి సాయిలు, కమ్మరి రాములు, నాగరావు, సుశీల తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular