ప్రవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన కొనసాగుతుంది. పది పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలోనూ ఉత్తమ ఫలితాలను సాధించారు.
కోటగిరి మరియు పోతంగల్ మండలాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక 9.5 గ్రేడ్ పాయింట్లు సాధించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోతంగల్ తెలుగు మీడియం విద్యార్థిని ఎం నవనీత కి మరియు పాఠశాల లో ద్వితీయ 8.8 సాధించిన విద్యార్ధిని డి గంగమణి కి పాఠశాల తరపున ప్రధానోపాధ్యాయులు సాయిలు శాలువాతో సన్మానించి, అభినందించారు.భవిష్యత్తులో బాగా చదివి ఉన్నత స్థానాలను అధిరోహించి పాఠశాల పేరు మరియు పోతంగల్ గ్రామం పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు నాగనాథ్, సి ఆర్ పి లు రమేష్, హన్మంతరావు, విశ్రాంత ఉపాధ్యాయుడు సూదం విఠల్ , పాఠశాల శ్రేయోభిలాషి సూదం శంకర్, కోటగిరి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంట్ల గంగాధర్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

