మే డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క
దోపిడీ వ్యవస్థలకు ప్రభుత్వాలు చర్మ గీతం పాడాలని కార్మికులు ఐక్యంగా ఉండి తమ సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలని మంత్రి సీతక్క అన్నారు.ములుగు జిల్లా కేంద్రములో ఏఐటీయూసీ మరియు గ్రామపంచాయతీ కార్మికులు మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సీతక్క జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
శ్రమ లేకుండా మానవుడు లేడు. శ్రమ లేకుండా సంపద లేదు. శ్రమ లేకుండా మానవ జీవితమే లేదని అన్నారు. శ్రమైక జీవనసౌందర్యానికి సమానమన్నది లేనేలేదని, ఒక మనిషి శ్రమని మరో మనిషి దోచుకోవడం ప్రారంభమైన తర్వాత శ్రమతో సృష్టించబడిన సంపద పరాయికరణ చెంది ఎటువంటి శ్రమ చేయని కొద్ది మంది చేతుల్లో సంపద పోగువ డటం మొదలైందని శ్రమ పరాయీకరణతో క్రమంగా మనిషి పరాయీకరణ చెందాడని అన్నారు.
దోపిడీ అంతంకావాలంటే వ్యవస్థ మారడం తప్ప వేరే మార్గం లేదు. దోపిడీ రహిత సమాజం కోసం ఎర్ర జెండాను ఎత్తిని అమరవీరులకు జోహార్లు అర్పించారు. మేడే కేవలం ఎనిమిది గంటల పనిదినం కోసమే కాదు. శ్రామికుల శ్రమ దోపిడీని అంతం చేయాలని, కార్మిక వర్గ రాజ్యం స్థాపించడం పరితపించాలనె వారందరికీ స్ఫూర్తిని ఇచ్చేది మేడే. అందుకే ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తెంచి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
