Monday, September 28, 2026

కార్పొరేట్ సంస్థలకు పెద్ద పీట

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి.. కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్

దేశంలో, రాష్ట్రంలో పాలకులు కార్పొరేట్ వ్యవస్థలకే పెద్దపీట వేశారని, మధ్యతరగతి వ్యాపారులు వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారని, రాష్ట్రంలో సెంటిమెంట్ తో, కేంద్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టి ఇప్పటివరకు అధికారంలోకి వచ్చారని, అటువంటి బిజెపి, టిఆర్ఎస్ పార్టీలకు ప్రజలు చరమగీతం పాడాలని ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల పిలుపునిచ్చారు. నల్లధనాన్ని వెలుగులోకి తీసుకొచ్చి పేదల ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్న మోడీ హామీ ఎటు పోయిందని ప్రశ్నించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ పిలుపునిచ్చారు. బుధవారం జుక్కల్ మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే పార్టీ అని, టిఆర్ఎస్ బిజెపి పార్టీలు కేవలం సెంటిమెంట్, కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు వేయించుకొనే పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేశారన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకువచ్చి దేశంలో ఉన్న ప్రతి పౌరుని ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామని చెప్పిన హామీ ఏమైందన్నారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రమాదంలో పడేస్తూ నల్ల చట్టాలు తీసుకురావడంతో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ కేవలం ఆదాని అంబానీల కోసమే బిజెపి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. బిజెపి అభ్యర్థి బీబీ పాటిల్ బిజినెస్ పాటిల్ గా మారారని ప్రజలు తమ ఓటు అనే వజ్రాయుధంతో బిఆర్ఎస్ బిజెపి పార్టీలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్కార్, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,మండల అధ్యక్షుడు సంజు పటేల్, జడ్పిటిసి దాదారావు పటేల్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆస్పత్ వార్ వినోద్, అరుణ్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular