Wednesday, March 25, 2026

ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన

ధాన్యం కొనుగోలులో అవకతవకల పై రైతులు ఆందోళన ను వ్యక్తపరిచారు. బీబీపేట మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద క్వింటాలుకు నాలుగు కిలోలు అదనంగా తీసుకున్న ధర్మ కాంట్ట వద్ద ఒక లారీ లోడు ధాన్యం కు సుమారు 11 నుంచి 12 క్వింటాళ్ల ధాన్యం తూకంలో తక్కువ చూపించడంతో రైతులు విషయం తెలుసుకొని ఆందోళన చేపట్టారు. సంబంధిత అధికారులు ధర్మ కంట ని పరిశీలించగా తూకంలో తేడా రావడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మ కాంటాలో సాంకేతిక కారణాలవల్లనే తప్పు జరిగిందని ధర్మ కంట యాజమాని ఒప్పుకోవడంతో రైతులు ఆందోళన విరమించారు. ఇకముందు ఇటువంటి తప్పిదాలు జరిగితే ఉపేక్షించేది లేదని రైతులు హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular