Friday, February 13, 2026

కేంద్రంలో తెలంగాణ గళం వినిపిద్దాం

ప్రజల కోసం పనిచేయని ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి తెలంగాణ సమస్యలపై పార్లమెంటులో గళం విప్పుదామని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ మండల కేంద్రంలో జరిగిన రో గోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ లలో జహీరాబాద్ టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ తో కలిసి పాల్గొన్న మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి , కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, మండల, గ్రామాల, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ కంటే ఎక్కువ చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను, మహిళలను, ప్రజలను నమ్మించాడు.
ఎన్నికలు అయిపోగానే ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నాడు.మాట చెప్పి నిలబెట్టుకున్న వారిని గెలిపించుకుందామా లేక మాటలు చెప్పి మోసం చేసిన వారిని గెలిపిద్దామా ??
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రైతుబంధు ఇస్తానని ఇచ్చిండు, పెన్షన్ మొదట రూ. 1000 తరువాత రూ. 2000 చేసిండు. పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి రూ. లక్షా నూటపదహార్లు ఇచ్చిండు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లు ఇచ్చారు.24 గంటల కరంటు సరఫరా చేసినం, బతుకమ్మ పండుగకు ఆడబిడ్డకు చీరలు ఇచ్చినం. రంజాన్ పండుగకు ముస్లిం లకు, క్రిస్మస్ పండగకు క్రిస్టియన్ లకు బట్టలు పంపిణీ చేశాం.దేశంలో అనేకమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ 4.70 లక్షల మంది బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. కానీ ఇంతవరకు హామీలు అమలు కాలేదు.రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు మీకు అందితే అందరూ కాంగ్రెస్ కే ఓటు వేయండి. లేకపోతే బుద్ధి చెప్పండి.రైతుబంధు ఎకరాకు రూ. 15,000,
కౌలు రైతులకు ఎకరాకు రూ. 15,000, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000, వరి పంటకు క్వింటాలుకు రూ. 500 బోనస్,18 ఏళ్ళు దాటిన మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇయ్యలేదు. ఆసరా పెన్షన్ రూ. 4000 కు పెంచుతామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4000 ఇస్తామన్నారు. 24 గంటల కరంటు ఇస్తామన్నారు.
కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకంలో ప్రస్తుతం ఉన్న లక్షా నూటపదహార్లతో పాటుగా తులం బంగారం ఇస్తామన్నారు. ఒక్క ఆడబిడ్డకు కూడా ఇవ్వలేదు.
డిసెంబర్ 9న ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు లేదు. 200 యూనిట్ల వరకు కరంటు ఫ్రీ అన్నారు, లేదు. రూ. 500 కు గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు. ఎక్కడా లేదు.
ఇందులో ఏది కూడా అమలు చేయడం లేదు. హామీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డికి ప్రజలు ఓటు తో బుద్ది చెప్పాలి.
పది సంవత్సరాలు కడుపులో పెట్టుకుని కాపాడిన కేసీఆర్ కు మనం మద్దతు తెలపాలి.
33 జిల్లాలు వద్దు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క జిల్లా చాలంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మన జిల్లా ను కాపాడుకోవాలంటే బిఆర్ యస్ పార్టీకి మద్దతు తెలపాలి.
పాలిచ్చే బర్రెను దూరం చూసుకోవద్దు, గొడ్డు బర్రెను దగ్గరకు తీసుకోవద్దు
2014 లో తెలంగాణ రాష్ట్రంలో BRS పార్టీ, కేంద్రంలో బిజేపి ఒకేసారి అధికారంలోకి వచ్చాయి. గత పదేళ్ళలో రైతుల కోసం బిజేపి ఏం చేసింది‌, యువకులు, వృద్ధులు‌ మహిళల కోసం ఏం చేసిందో చెప్పాలి.రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం‌,
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం, నల్లధనం వెనక్కి తెస్తానని మోడీ చెప్పారు. పదేళ్లలో వారు చేసింది ఏమీ లేదని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
అంబానీ, ఆదాని లకు లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మాఫీ చేసిండు.
పదేళ్ళు పార్లమెంట్ సభ్యులు గా పనిచేసి ఇప్పుడు బిజెపి అభ్యర్థిగా ఉన్న బిబి పాటిల్ ఏ పని చేయలేదు. అందుకే ఓటుతో బుద్ధి చెప్పాలి.
అంతకు ముందు అయిదేళ్ళు ఎంపీ గా పనిచేసిన కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షెట్కార్ కూడా ఏం పని చేయలేదు.ఏ పని చేయని వాళ్ళకు ఎందుకు ఓటు వెయ్యాలి.తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో నడిచిన వ్యక్తి అనీల్ కుమార్ . మంచి మనిషి.అందరూ కారు గుర్తుపై ఓటు వేసి పార్టీ అభ్యర్థి గాలి అనీల్ కుమార్ ని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని పోచారం పోచారం విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular