జుక్కల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే ధ్యేయం గా ముందుకు సాగాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు. గత పాలకులు జుక్కల్ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని తాను నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేసి తీరుతానని ఎమ్మెల్యే అన్నారు.జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షేట్కార్ ,తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ హన్మంత్ షిండే పదిహేనేళ్లు జుక్కల్ ను ,
బి బి పాటిల్ పదేళ్ల నుండి జహీరాబాద్ ను దోచుకొని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నిక లో అవినీతి అసమర్థుడు అయిన హన్మంత్ షిండేను ఏ విధంగా బుద్ధి చెప్పి ఓడించారో
అదేవిధంగా ఇప్పుడు బి. బి పాటిల్ ఓడించాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు.సురేష్ షేట్కార్ ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని..సంగారెడ్డి నుండి జుక్కల్ నియోజకవర్గం వరకు నాలుగు లైన్ల రోడ్డు సురేష్ షెట్కార్ తీసుకొచ్చారని కొనియాడారు.మళ్ళీ ఆయనను గెలిపిస్తే మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.
అందుకే ప్రజలు ఆలోచించి విజ్ఞతతో సరైన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సురేష్ షేట్కార్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

