Friday, February 13, 2026

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయండి

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రసంగించిన జుక్కల్ ఎమ్మెల్యే

జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా డోంగ్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రసంగించారు. జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షేట్కార్ పాల్గొన్నారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ సౌమ్యుడు విజ్ఞానవంతుడు తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సురేష్ షెట్కార్ ని బలపర్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సురేష్ షెట్కార్ ని గెలిపించుకుంటే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని,
తాను అభివృద్ధి పనులు చేయిస్తానని అన్నారు.
బి. బి. పాటిల్ పదేళ్లు ఎంపీగా పనిచేసి తన సొంత ఊరు అయిన సిరిపూర్ కు రోడ్డు వేయించలేని అసమర్థుడు చేతకాని దద్దమ్మ అని విమర్శించారు..సొంత ఊరుకు రోడ్డు వేయించలేనోడు ఇక జహీరాబాద్ ను ఏం అభివృద్ధి చేస్తాడని నిలదీశారు.
పదేళ్లు ఎంపీగా అవకాశం ఇస్తే ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటువంటి వ్యక్తిని మళ్లీ గెలిపిస్తే చేసేది ఏం వుండదని,
దున్నపోతుకు గడ్డి వేస్తే అది పాలు ఇస్తుందా అని ప్రశ్నించారు.తన వ్యాపారాల మీద తప్ప ప్రజల సమస్యల మీద ఎటువంటి పట్టింపు లేని వాడని అన్నారు.
జుక్కల్ నారాయణ ఖేడ్ మధ్యలో ఫార్మా సిటీ రాబోతుందని మన పిల్లలకు ఉద్యోగాలతో పాటు మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
ఆలోచించి అభివృద్ధి చేసే పార్టీకి ఓట్లు వేయండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular