Friday, February 13, 2026

భవిష్యత్ ప్రధాని రాహుల్ గాంధీ

కుటుంబ పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం

ఉపాధి హామీ కూలీలతో సమావేశమైన మంత్రి సీతక్క

శాసనసభ ఎన్నికల్లో కుటుంబ పాలనకు, ప్రజా వ్యతిరేకతకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
ములుగు మండలం లోని ఇంచేర్ల,జంగాల పల్లి
జగ్గన్న పేట, మల్లం పల్లి
మహమ్మద్ గౌస్ పల్లి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల దగ్గర ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడే ఉపాధి హామీ పథకం అమలు చేసి పేదలకు పని కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని కేంద్రములో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీలకు రోజుకు 400 రూపాయలు ఇస్తామని కేంద్రంలో అధికారంలోకి రాలేమని తెలిసిన బీజేపీ, ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతూ జైల్లో పెడుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితులలో దేశంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి
కాంగ్రెస్ పార్టీ కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. జీఎస్టీ తీసుకువచ్చి రూ.54 లక్షల కోట్లను పేదల నుంచి వసూలు చేశారని ఆరోపించారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్ని ఇచ్చారో చెప్పాలన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు పదేళ్లలో కూడా నెరవేరలేదన్నారు. జన్ ధన్ ఖాతాలో 15 లక్షలు వేశారా ఒక్క సారి ప్రజలు ఆలోచన చెయ్యాలి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చెయ్యడమే మన లక్ష్యమని కాంగ్రెస్ నేతలకు సూచించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేశామన్నారు. బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలనలో రాష్ట్రాన్ని లూటీ చేశారని విమర్శించారు. రైతును రాజును చేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు 10 లక్షల జీవిత భీమా ఇస్తామన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్‌ని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular