ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే ను జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు జెండాను ఎగరవేసి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కార్మిక వర్గం కష్టజీవులు నియంతృత్వ విధానాలు బానిస సంఖ్యలకు వ్యతిరేకంగా 8 గంటల పని దినాలు కొరకు అమెరికాలోని చికాగో నగరంలో పోరాడి సాధించుకున్న హక్కులను నేటి పాలకవర్గం కార్మికులకు కనీస వేతనాలు అమలు పరచడంలో , భద్రతను కల్పించడంలో , ఉపాధి అవకాశాలను పెంచడంలో కార్మిక చట్టాలను మార్చి తిరిగి 12 గంటల పనిని అమలు జరపాలని ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలను అదుపు చేయకపోవడంతో కార్మికుల వేతనాలు సరిపోక దారిద్రం పెరిగే పేదరికంలోకి నెట్ట వేయబడుతున్నారని అసంతృప్తితో పోరాడే కార్మికుల పైన దాడులు చేస్తూ నిర్బంధాలకు గురి చేస్తున్నారని కార్మిక వర్గం మధ్య ప్రజల మధ్య మతవైశ్యమ్యాలను పెంచి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని వీటికి వ్యతిరేకంగా మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం, కష్టజీవులు కుల ,మత ,ప్రాంతీయ భేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అప్పుడే మే డే ను అమరులైన కార్మికుల యొక్క త్యాగాలను నిలబెట్టిన వారవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, నగర కమిటీ సభ్యులు కటారి రాములు, నరసయ్య, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సిర్ప లింగం, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అనిత ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విగ్నేష్, మరియు కృష్ణ, అనిల్, మోహన్, తదితరులతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం. అర్సపల్లి చౌరస్తాలో పార్టీ జెండాను ఎగరవేయడం జరిగింది. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం సారంగాపూర్ లోని తెలంగాణ సీడ్ కార్మికులతో సిఐటియు జెండాను ఆవిష్కరించటం జరిగింది. తర్వాత బహుజన కాలనీలో పార్టీ జెండాను ఎగరవేయడం జరిగింది.
నియంతృత్వాన్ని ఎదిరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి
RELATED ARTICLES
