పార్టీలో కష్టపడి పని చేసిన ప్రతీ ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుంది.




కొత్త, పాత అనే బేషజాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా పని చేయాలి…*
ప్రచార కమిటీ, సోషల్ మీడియా, మీడియా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి
పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి
మ్యానిఫెస్టో లోని 5న్యాయ సూత్రాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి.
దళితులు, మైనారిటీ ఓట్లను మనకు అనుకూలంగా మలచుకోవాలి
దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలు ఎప్పుడు కాంగ్రెస్ వైపే ఉంటుంది
నాయకులు, కార్యకర్తలు ఒక్క ఎంపీ ఏ కాదు సమిటిగా పని చేసి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే మన ప్రధాన లక్ష్యంగా పని చేయాలి
వర్థన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం బలపడుతోంద
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రం లోని ఏబీఎస్ ఫంక్షన్ హాల్ లో వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన వర్ధన్నపేట పరిధిలోని బూత్ ఇన్చార్జిలు మరియు బూత్ కన్వీనర్ల మరియు ముఖ్య నాయకులతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య మరియు స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి హాజరయ్యారు.
బూత్ ఇన్చార్జిలు, కన్వీనర్ల సమన్వయ కమిటీల కు దిశా నిర్దేశిస్తూ ప్రతి ఒక్కరూ సమన్వయం చేసుకుంటూ సమర్ధంగా నాయకులు కష్టపడి పార్టీలో అమలు చేయబోతున్న 5 న్యాయాలు, 25 పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి మన అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఇన్చార్జి ముఖ్య నాయకులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.. అనంతరం వర్ధన్నపేట టౌన్ ప్రాంతానికి చెందిన సుమారు 100 మందిని యువకులను బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులైన వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
ఈ సమీక్ష సమావేశంలో డిసిసిబి బ్యాంక్ చైర్మన్ మార్నెని రవీందర్ రావు, ఓబీసీ సెల్ నాయకులు కత్తి వెంకటస్వామి గౌడ్, నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు,మున్సిపల్ చైర్మన్ ఆంగోత్ అరుణ, కౌన్సిలర్లు, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపల్లి దేవేందర్రావు, మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు మైస సురేష్, సీనియర్ నాయకులు బండి సుధాకర్ గౌడ్, పోశాల వెంకన్న, అనిమిరెడ్డి కృష్ణారెడ్డి మండల గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
