ఎర్రజెండాలు ఎగరవేసి కార్మికులకు తన సందేశం అందచేసిన బోధన్ నియోజకవర్గ కార్యదర్శి వేషాల
మే డేను పురస్కరించుకుని బుధవారం నాడు సిపిఐఎం పార్టీ బోధన్ నియోజకవర్గం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బోధన్ టౌన్ బోధన్ రూరల్ సాలూరు మండలం రెంజల్ మండలం ఏడపల్లి మండలం నవీపేట్ మండలం వివిధ చోట్ల సిపిఐఎం పార్టీ జెండాలు ఎగరవేశారు. సిఐటియుకార్మిక సంఘం జెండాలు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రైతు సంఘం జెండాలు మేడే సందర్భంగా ఎగిరివేయడం జరిగింది
సందర్భంగా సిపిఐఎం పార్టీ బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం ఏరియా కమిటీ కార్యదర్శి ఏ షాల గంగాధర్ మాట్లాడుతూ మేడే ప్రపంచవ్యాప్తంగా కులాలకు మతాలకు ప్రాంతాలకు జాతులకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా జరుపుకుంటున్న ఏకైక పండగ మేడే అని అన్నారు. శ్రమతోనే ఈ ప్రపంచమంతా మనుగడ కొనసాగుతుందని శ్రమ లేనిదే ఈ ప్రపంచంలో ఈ పని జరగదని శ్రమ యొక్క ముఖ్య ఉద్దేశమే మేడే ఆవిష్కరణ అని అన్నారు. గతంలో అమెరికా దేశం చికాకోనగరంలో 1886 సంవత్సరంలో అక్కడున్నటువంటి ఉద్యోగ కార్మిక వర్గం పని గంటలు తగ్గించటం కోసం ఉద్యమాలు చేపట్టి నిరసన చేస్తున్న సందర్భంలో అప్పటి ప్రభుత్వం ఆ ప్రజల పైన కాల్పులు జరిపితే అనేకమంది మరణించడం జరిగింది. మరణించిన వారి రక్తం నుంచి తెల్ల గుడ్డను ఎర్ర గుడ్డగా మార్చి ఆనాటి నుంచి నేటి వరకు వారికి స్ఫూర్తిగా మే ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో మేడేను నిర్వహించుకోవడం జరుగుతుంది. కానీ నేడు భారతదేశంలోని బిజెపి ప్రభుత్వం ఎనిమిది గంటల పని దినాలకు బదులు 12 గంటలు పెట్టి రోజు కూలి 178 రూపాయలు చేసి కనీస వేతనం 26,000 కాకుండా 5800 చిల్లర ఇవ్వడంతో ఈ బిజెపి ప్రభుత్వం కార్మికుల్ని రైతులని ప్రజల్ని గుర్తించకుండా పెట్టుబడుదారులకు వారికి లాభాలు కొనసాగించడానికి వారి పక్షాన ప్రభుత్వ నిలబడింది తప్పితే దేశంలో 100 90 శాతం ఉన్నటువంటి శ్రామిక వర్గానికి వైపు కాకుండా పది శాతం ఉన్నటువంటి పెట్టుబడుదారుల వైపు బీజేపీ ప్రభుత్వం ఉంది .అందుకని 2024 ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించి దేశంలో లౌకికవాదులైనటువంటి ఇండియా కూటమి పార్టీలు అధికారంలోకి తీసుకువచ్చి ప్రజా సమస్యల పరిష్కరించుకోవాలని దేశ ప్రజలకు రైతులకు కార్మికులకు వ్యవసాయ కూలీలకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం పార్టీ బోధన్ నియోజకవర్గ ఏరియా కమిటీ సభ్యులు కుప్పిరియాల బాలయ్య దండు సాయిలు, దాసారం ప్రకాష్. మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు పార్టీ సభ్యులు ఆసరి లింగం రవి సావిత్రి సాయిబాబు అభిలాష్ సోనీ స్వరూప రాణి పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
