మరోసారి మంచి మనసు చాటుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఎవ్వరు ఏ సమస్య ఉందని వచ్చినా.. తక్షణమే తానున్నానని సాయం చేసే కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ హాస్పటల్ రూపురేఖలనే మార్చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏసీలు లేని విషయం ఆ నోటా ఈ నోటా కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి వచ్చింది. ఇంకేముంది.నిత్యం ఎందరినో ఆదుకునే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తన మంచి మనసుతో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 20 ఏసీలను హాస్పిటల్ కి అందించారు. అందించడమే కాదు.. వాటిని పూర్తిగా ఇన్ స్టాల్ చేయించారు. ఒక్క ఏసీలు మాత్రమే కాదు డోర్ కర్టెన్ల నుంచి మొదలుకుంటే పేషేంట్ల సౌకర్యార్ధం కావల్సినవన్నీ అమర్చారు. దీంతో హాస్పిటల్ లోని ఆయా వార్డులన్నీ కార్పోరేట్ హాస్పిటల్ స్థాయికి మారిపోయాయి. ఇంతకు ముందు హాస్పిటల్ కు వచ్చిన పేషేంట్లు సౌకర్యాల కల్పన తర్వాత హాస్పిటల్ ను సందర్శించి ఇది ప్రభుత్వ హాస్పిటలా.. కార్పోరేట్ హాస్పిటలా అని ఆశ్చర్యపోయేలా ఆసుపత్రిని తీర్చిదిద్దారు.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవపై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషేంట్లు ఆనందంవ్యక్తం చేస్తున్నారు. మేం అసలు ప్రభుత్వ హాస్పిటల్ లో ఇన్ని సౌకర్యాలతో ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేయలేదని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో ఇన్ని సౌకర్యాలు కల్పించిన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
