Friday, February 13, 2026

ప్రాణహిత కు నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధం

కౌటాల : మండల కేంద్రంలోని జగదాంబ గార్డెన్స్ లో భారతీయ జనతా పార్టీ గోడం నాగేష్ విజయాన్ని కాంక్షిస్తూ విజయ సంకల్ప సభను నిర్వహించారు.

*గోడం నాగేష్ మాట్లాడుతూ శాసనసభ్యునిగా డా.పాల్వాయి హరీష్ బాబుకు అవకాశం ఇచ్చిన సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు తనకు ఎంపీగా అవకాశం ఇవ్వాలని, ఇద్దరం జోడెడ్ల లాగా పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని హామీ ఇచ్చారు. సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టుకు 60 శాతం నిధులు సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని అన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క కి సవాల్ విసిరారు. వెంటనే పనులు ప్రారంభించాలని, 60 శాతం నిధుల కోసం డి.పి.ఆర్ సిద్ధం చేస్తే మోదీజి ప్రభుత్వం నిధులు అందించడానికి సిద్ధంగా ఉందన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular