Friday, February 13, 2026

నేడు హెగ్డోలి లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

పుప్పాల శంకర్ ఇంటికి ఏనుగు రవీందర్ రెడ్డి రాక

గురువారం సాయంత్రం
6 గంటలకు పోతంగల్ మండల గ్రామాల సమన్వయ కమిటీతో సమావేశం నిర్వహించినట్లు పోతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి రానున్నారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో బూతులు వారీగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి ప్రతి బూతులో అత్యధిక ఓట్లు సాధించే విధానపరమైన దిశా నిర్దేశం చేయనున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎంపీ సురేష్ ను భారీ మెజార్టీతో గెలిపించి రాబోయే రోజుల్లో మన ప్రాంత వానిని పార్లమెంటులో వినిపించే వీలు కలుగుతుందని కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కార్యక్రమానికి పోతంగల్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని మనవి. ఈ సమావేశం పుప్పాల శంకర్ మాజీ. జెడ్పిటిసి కోటగిరి స్వగ్రామం హెగ్డోలి ఇంటి ఆవరణలో నిర్వహించినట్లు పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular