Friday, February 13, 2026

కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం ఎస్ ఎన్ పురంలో కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ సర్పంచ్ శ్రీమతి నేమాని నాగమణి వీర్రాజు ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ అరటి పండ్లు పంపిణీ చేశారు. వర్ని మండలం ఎస్ఎన్ పురం గ్రామపంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజా మాజీ సర్పంచ్ నేమాని నాగమణి వీర్రాజు ఆధ్వర్యంలో ఉపాదిహామి కూలీలకు అరటి పండ్లు,మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి , వర్ని ఎంపీపీ మేక లక్ష్మీ వీర్రాజు మాట్లాడుతూ రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ని గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు ఫ్రీ,10 లక్షల ఆరోగ్యశ్రీ,500 రూపాయలకు సిలిండర్ పథకాలను అమలు చేస్తుందని ఎన్నికల కోడ్ తర్వాత ఇతర సంక్షేమ పథకాలు, రెండు లక్షల రుణమాఫీ 2500 రూపాయలు మహిళలకు నెలకి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి నిరుపేద కుటుంబానికి సంవత్సరానికి లక్ష రూపాయలు వారి ఖాతాలో వేయడం జరుగుతుందని పథకాలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించి చేతి గుర్తుకు ఓటు వేయాలని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందని దీనికి తోడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు.* ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు మోయిన్ డిసిసి డెలిగేట్ గంగా ప్రసాద్, రాష్ట్ర మైనార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ భారీ, గ్రామ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హర్ష, ఉపాధ్యక్షుడు శ్రీను, దామినేని నాగేశ్వరరావు ముత్యాల కృష్ణ, ప్రశాంత్, గుణ్ణం వెంకటేశ్వరరావు,బొజ్జ శ్రీను,నాగరాజు,వంక శ్రీను ,చారి,గజ్జల సాయిలు, నర్సింలు,భీష్మ, నేమాని రఘు,ముక్తార్,ఆవేశ్, నిఖిల్,శంకర్,బాలరాజ్, నవీన్ ,సాయి,వెంకటేష్, సతీష్,అరుణ్ రెడ్డి,జలీల్,అత్తర్,రాజు,అన్వర్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular