Friday, February 13, 2026

రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర

పార్లమెంట్ ఎన్నికల నేపత్యంలో పాలకుర్తి మండలం మైలారం గ్రామంలో ఉపాధి హామీ కూలీల తో కావ్య గెలుపు కోరుతూ ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి

రాజ్యాంగ నిర్మాత
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాతలను చెరిపేందుకు బిజెపి ప్రయత్నిస్తుందని బడుగు బలహీన వర్గాలు అప్రమత్తంగా ఉండి పార్లమెంటు ఎన్నికల్లో తమ నిర్ణయాన్ని తీసుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి కోరారు.ప్రతిపక్ష పార్టీలు అబద్ధపు మాటలతో ప్రచారం చేస్తున్నారని, ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తుచేశారు. దళిత, గిరిజన, మైనారిటీ, బిసి వర్గాలకు పెద్దపీట వేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని వివరించారు.
రుణమాఫీ పేరుతో బిఆర్ఎస్ రైతులను మోసం చేసింది, 60 శాతం మంది రైతులు రుణమాఫీకి నోచుకోలేదు, బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది, బిజెపి ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతూ కుల మతాల మధ్య చిచ్చు పెడుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ పార్టీ కుట్ర చేస్తుంది అని గుర్తు చేసారు.ప్రజలకు రిజర్వేషన్ హక్కు కల్పించేందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది, రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేసేందుకు కడియం కావ్య ని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు._ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి, మండల కాంగ్రెస్ ముఖ్యనాయకులు, యూత్ నాయకులు, మహిళ నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular