మహిళగా తోటి మహిళలు అండగా నిలవండి
పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక మ్యానిఫెస్టో
ఇచ్జిన హామీలన్నీ అమలు చేస్తాం
మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి పిలుపు
సునితమ్మ ను భారీ మెజార్టీతో గెలిపించండి
మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పిలుపు
మేడ్చల్: మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేంధర్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గంలోని ఘట్కేసర్, నాగారం మున్సిపల్, కీసర గ్రామంలో గురువారం చేపట్టిన ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన వచ్చింది. నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ వజ్రేశ్ యాదవ్ ఆధ్వర్యంలో రోడ్డుషోలు, పాదయాత్ర లు నిర్వహించారు. మండుటెండలోనూ రోడ్డు షోలకు మహిళలు భారీగా తరలివచ్చి సునితమ్మపై అభిమానాన్ని చాటారు.
తాము సునితమ్మ అభయహస్తం కోసం ఆమె వెన్నంటే నడుస్తామని చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గ సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం ప్రత్యేక మ్యానిఫెస్టోను తయారు చేసినట్లు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి ఈ 10 రోజులు పనిచేస్తే తాను 5 ఏళ్ళు నాయకురాలుగా కాకుండా ప్రజల మధ్యే ఉండి సేవకురాలిగా పనిచేస్తానని మాట ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తానని అన్నారు. ప్రజా సమస్యలపై తనకు సంపూర్ణమైన అవగాహన ఉందని, రంగారెడ్డి జడ్పి చైర్ పర్సన్ గా ఈ ప్రాంతం అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. మీ ఇంటి ఆడపడచుగా తనను ఆదరించి అండగా నిలవాలని కోరారు. మహిళలు, నిరుద్యోగులు, యువత, రైతులు, వ్యాపారస్తులు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉండి పనిచేస్తానని అన్నారు. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ మంచి మనసున్న నాయకురాలు సునీతా మహేంధర్ రెడ్డి అన్నారు. భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. పనిచేసే వారికి పట్టాం కట్టాలని కాంగ్రెస్ పార్టీతోనే భాగ్యనగరం అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలోడీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జీ వజ్రేశ్ యాదవ్ , మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ జడ్పిటీసీ నక్కా ప్రభాకర్ గౌడ్, నియోజకవర్గ సీనియర్ నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు.




