ఎల్లారెడ్డి నియోజకవర్గ బిఆర్ఏస్ పార్టి కి బిగ్ షాక్

2019 ఓటమి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుకు నాందిగా తీసుకున్న మదన్మోహన్
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికల ముందే కొన్నేళ్లపాటు మదన్మోహన్ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారు. ఆనాడు రేపు పదవి లేకపోయినా ప్రజలకు అండగా నిలబడి సహాయ సహకారాలు అందించి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో ఎంతోమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానం మదన్ మోహన్ వైపు మొగ్గు చూపడంతో మదన్మోహన్ కు టికెట్ కేటాయించారు. ఎంతోమంది నాయకులు ఎన్నికల ముందు ఎన్నో ఎత్తుగడలు వేసి ప్రజలను ఆకట్టుకుని ఎన్నికల్లో గెలుపొంది అనంతరం హైదరాబాద్ లాంటి పట్టణాలకు మఖము మార్చి వారి హంగు ఆర్భాటాలను ప్రదర్శిస్తుంటారు. మదన్మోహన్ అలా కాకుండా నియోజకవర్గంలో పాలనలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. శాసనసభ ఎన్నికల ముందు ఏ పదవి లేకపోయినా ప్రజలకు సేవలందించి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలుపొందిన దీ మాను పక్కనపెట్టి ఆనాడు అధికారం పదవి లేకపోయినా ప్రజలకు చేరువయ్యారు. నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టడం మరోపక్క ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా మదన్మోహన్ గెలుపొందడంతో ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉండి సేవలను అందిస్తున్నారు. ప్రభుత్వం నుండి అందించాల్సిన పథకాలే కాకుండా ప్రజలకు కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా తాను అండగా నిలబడతానంటూ మాటిచ్చిన మాట ప్రకారం ఎవరికి ఆపద వచ్చినా తన సొంత డబ్బును సైతం వెచ్చిస్తున్నారు. గతంలో ఎల్లారెడ్డి కొంతవరకు అభివృద్ధిలో వెనుకబాటుకు గురైందని అనే అపవాదు ఉంది. వెనకబాటు అనే మాట రాకుండా అభివృద్ధిలో దూసుకుపోయేందుకు మదన్మోహన్ తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే శాసనసభ సమావేశాల్లో మదన్మోహన్ ఎల్లారెడ్డి సమస్యలపై గళం విప్పారు. ఐటి రంగంలో మంచి అనుభవం ఉన్న యువ నాయకుడు యువతకు ఉపాధి అవకాశాలను ఇప్పటికే ఎంతోమందికి కల్పించారు. ప్రభుత్వం తనకు ఐటి రంగంలో మంత్రిగా అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రంలోని యువతను ఐటీ రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతాను అన్నా అంశాన్ని ప్రజల వద్ద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కన్నా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి రెట్టింపు మెజార్టీ సాధించి తీరుతాను అన్న భీమాను మదన్మోహన్ వ్యక్తం చేస్తున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అతి స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓటమి పాలయ్యారు. ఓటమిని ఒక అనుభవంగా తీసుకొని ఐదేళ్లపాటు బాన్సువాడలో, ఎల్లారెడ్డిలో గెలుపుకు బాటలు వేసుకున్నారు. ఆనాటి బీ ఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ నేటి పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా బరిలో దిగారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి లు నువ్వా నేనా అన్న చందంగా జహీరాబాద్ ఎన్నికల్లో పోటీపడుతున్నాయి. ఆనాడు పాటిల్ చేతిలో ఓటమి పాలు కావడం మదన్మోహన్ కు మరింత పట్టు సాధించుకునే ప్రయత్నంలో పార్లమెంట్ ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం చేపడుతూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు. పాటిల్ ఎల్లారెడ్డికి అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదని, అలాంటి బిజినెస్ పాటిల్ ఎలా మళ్లీ ఓటర్లను ఓట్లు అడుగుతున్నారని మదన్మోహన్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎలాగైనా సరే పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుని తీరాలని ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలకు మదన్మోహన్ వివరిస్తున్నారు. అభివృద్ధి సంక్షేమాలు అందించడంలో తాను ముందు ఉంటానని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా తానే బాధ్యత వహిస్తానని పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి తీరాలని ఓటర్లకు నొక్కి చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో చేజార్చుకుంది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గ అభివృద్ధికి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంలో మదన్మోహన్ నడుం బిగించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో అతి బలంగా ఉందని ప్రజలు నమ్ముతున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ఎంతోమంది పార్టీను వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారు. ఇప్పటికే గులాబీ తమ్ముళ్లు ఎంతోమంది హస్తం గూటికి చేరారు. మరోపక్క బిజెపి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికల్లో సైతం బలహీనంగా ఉన్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో మరింత బలహీన పడుతుంది. ఆనాటి శాసనసభ ఎన్నికల టికెట్లు విషయంలో సుభాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో బిజెపి తీర్థం పుచ్చుకొని ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీచేసి చావు దెబ్బ తిన్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సుభాష్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. 2019లో తాను స్వల్ప ఓట్లతో ఓటమి పాలు కావడం మదన్మోహన్ సవాలుగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే ధ్యేయంగా ఎన్నికల ప్రచారాన్ని చేపడుతున్నారు.
జెడ్పిటిసి తో 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీకు రాజీనామా చేసి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారీ మండల జడ్పిటిసి శంకర్ నాయక్, గుర్జల్ తండా గ్రామ సర్పంచ్ దశరథ్ నాయక్ తో పాటు గాంధారీ మండల బిఆర్ఏస్ 200 మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి హస్తం గూటికి చేరారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మదన్ మోహన్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ గెలువు కు కృషీ చేసి ఎల్లారెడ్డి గడ్డ పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం అని తెలిపారు.
