Friday, February 13, 2026

కొవిషీల్డ్‌ సురక్షితమైందే ఆందోళన వద్దు – ఆస్ట్రాజెనకా సంస్థ

న్యూ ఢిల్లీ : తమ కరోనా వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రయోగ పరీక్షల్లో ఆస్ట్రాజెనకా (కొవిషీల్డ్‌) టీకా ఫలవంతమైన రేటు మెరుగ్గా వచ్చిందని, దానికి సంబంధించిన బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ప్రకటించింది. తమ కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న పలువురిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్లు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు తలెత్తాయని బ్రిటిష్‌- స్వీడిష్‌ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనకా ఇటీవల చేసిన ప్రకటన కలకలం సృష్టించింది. ఇదే వ్యాక్సిన్‌ను మనదేశంలో ‘కొవిషీల్డ్‌’ పేరుతో తయారు చేసి విక్రయించారు. ఈ క్రమంలో ఆస్ట్రాజెనకా ప్రకటన కోట్లమంది భారతీయులను కూడా ఆందోళనలోకి నెట్టేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆస్ట్రాజెనకా మరో వివరణ ఇచ్చింది.ఆస్ట్రాజెనకా కరోనా వ్యాక్సిన్‌ ఫార్ములాతో మన దేశంలోని పుణెకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కంపెనీ టీకాను తయారు చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular