Friday, February 13, 2026

బాన్సువాడలో కాంగ్రెస్ కార్యకర్తలు తమ తడాఖా చూపించాలి

మోసరా మండల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఉర్దూ అకాడమీ చైర్మన్

బాన్సువాడ నియోజకవర్గం లోని కార్యకర్తలు నాయకులు ఐకమత్యంగా ఉండి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుకోవాలని ఉర్దూఅకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధన్ పిలుపునిచ్చారు.
బాన్సువాడ నియోజకవర్గం మోస్రా మండల్ లోని అన్ని గ్రామాల నుంచి భూత్ ఏజెంట్లతో కలిసి సమావేశం నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉర్దూ అకాడమీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అత్యధిక మెజార్టీతో సురేష్ శెట్కార్ ని గెలిపించాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రతినిత్యం ప్రజల మేలుకోరి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు అభివృద్ధిని చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని భావిభారత ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రధాని పీఠం కూర్చునే అవకాశం వస్తుందని స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరిన్ని గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రకటన చేశారని అన్నారు. స్వతంత్రం వచ్చినట్టు నుండి పేదల అభ్యున్నతికి కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని పేద ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని ఆనాడు ప్రధాని రాజీవ్ గాంధీ అమలు చేశారన్నారు. ఆనాటి నుండి నేటి వరకు కూలీలకు దేశంలో పనికొరత లేకుండా పోయిందన్నారు. ఆనాడు పనులు లేక ఎంతో మంది కూలీలు పేదరికంతో మగ్గుతూ పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు అని అటువంటి దుర్భర పరిస్థితుల నుండి నేడు పనిచేసే వారికి పని దొరికే వీలు కల్పించిన కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంత ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో సమర్ధించాలని పూర్తి అకాడమీ చైర్మన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎలమంచిలి శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular