మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కరీంనగర్ కు ఏదో చేసేశానంటూ ఊహాలోకంలో ఉన్నారని, ఈ ప్రాంతంలోని ఏ ఒక్క పేదవానికి డబల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని, బండి సంజయ్ ఎంపీ గా ఉంది కరీంనగర్ ను ఉద్ధరించిందేమీ లేదని, వారు చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే అభివృద్ధిపై చర్చించేందుకు తమ సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ నాయకులు సవాలు విసిరారు.కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు గెలుపు కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ తో హుజురాబాద్ నియోజకవర్గం లోని పలు మండలాల్లో ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మెటి సమ్మిరెడ్డి ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ కేసీఆర్ మరియు వినోద్ కుమార్ 10 సంవత్సరాల కాలంలో ప్రజలకు చేసింది ఏమీ లేదని ఒక్క నిరుపేద కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని రైతులకు ఎలాంటి రుణమాఫీ చేయలేదని పూర్తిగా తెలంగాణను దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అబద్దాలతో దొంగ మాటలతో గెలిచాడు 1000 కోట్ల నిధులు తీసుకొస్తా అన్నాడని ఆ నిధులు గురించి ప్రశ్నించే సమయం వచ్చిందని ప్రజలు నిలదీయాలని పిలుపునివ్వడం జరిగింది . బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కేంద్రంలో అధికారంలో ఉండి ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని మతత్వపు విద్వేషాలతో రాముని పేరు మీద ఓట్లు అడగడం మాత్రమే జరుగుతుందని, కాంగ్రెస్ బిఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి తెలంగాణను అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి సోనియా గాంధీ రాహుల్ గాంధీ కి కరీంనగర్ ఎంపీ బహుమానంగా ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నాగంపేట మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ పరిణామంగా భావించారు.
కరీంనగర్ కు కెసిఆర్ , బండి వరగబెట్టిందేమీ లేదు
RELATED ARTICLES
