Friday, February 13, 2026

కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ రాజ్యం

పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ దక్కించుకొని కేంద్రంలో కాంగ్రెస్ రాజ్యం ఏర్పాటు కాబోతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని పిట్లం మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెత్కార్ ఎన్నికల ప్రచారం లో పాల్గొని ప్రసంగించారు. గతంలో తాను ఎంపీగా ఉండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించామన్నారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తినకూడదు అన్న ఉద్దేశంతో ఆనాడు ప్రత్యేక తెలంగాణ కోసం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రవత్తిడి తీసుకొచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని ఇప్పటికే ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్నారని, మరిన్ని పథకాలను ఎన్నికల కూడా అనంతరం అమలు చేస్తారని ప్రజలకు వివరించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ఏర్పాటైన వెంటనే రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతామన్నారు. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారని, సమస్యల పరిష్కారమే తన ధ్యేయంగా రాహుల్ గాంధీ ఇప్పటినుండి అడుగులు వేస్తున్నారని వివరించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపడితే ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పిట్లం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు , జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షేట్కార్ ,తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బలరాజ్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ నుండి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణా రెడ్డి దొర,మాజీ ఉపసర్పంచ్లు,మాజీ వార్డు సభ్యులు, నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular