Friday, February 13, 2026

పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు వచ్చిన గ్రామాలను అభివృద్ధి చేస్తాం

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కోటగిరి, పోతంగల్ మండలాల బూత్ ఇన్చార్జిలతో సమావేశం ఏర్పాటు చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి.

40 ఏళ్లుగా బాన్సువాడ నియోజకవర్గంలో ఆధిపత్యం కొనసాగించిన నాయకులకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ బూతులో మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాబడతారో ఆ గ్రామాలను అభివృద్ధి పరుస్తామని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. 40 ఏళ్లలో 2004 మినహా ఏనాడు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బాన్సువాడలో మెజార్టీ ఓట్లను రాబట్ట లేకపోయారని, అటువంటి చరిత్రను తిరగరాసేందుకు తాను కంకణం కట్టుకున్నానని, కార్యకర్తలు అందరూ ఐక్యంగా ఉండి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థికి భారీ మెజార్టీ ఓట్లను సాధించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఓట్లను సాధిస్తే రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేద్దామని, గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే ముచ్చమటలు పడుతున్నాయని, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని ప్రారంభాలను కాంగ్రెస్ పార్టీ వారే చేసుకునే విధంగా చేస్తే పోచారం హైదరాబాద్ కు పరారు కావాల్సి వస్తుందని రవీందర్ రెడ్డి హెచ్చరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎంత కష్టానికి అయినా సిద్ధంగా ఉన్నానని కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా నిలబడతానని, పార్లమెంట్లో మెజార్టీ ఓట్లు సాధిస్తే తాను ముఖ్యమంత్రి కాళ్లు అయినా పట్టుకుని నియోజకవర్గ అభివృద్ధికి అత్యధిక నిధులు తీసుకువస్తానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. గ్రామాల్లో కార్యకర్తలు ప్రతి ఒక్కరు నడుంబిగించి రేపటి నుండి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టాలని మీతో పాటు నేను కూడా బాన్సువాడలో ఒక బూతులు చేసుకొని ఆ బూతులో మెజార్టీ ఓట్లు సాధించే విధంగా కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరైనా ప్రతి ఒక్కరు ఒక్క బూతును ఎంపిక చేసుకొని ఎన్నికల్లో తమ సత్తా చాటుకుందామని కార్యకర్తలకు స్పష్టం చేశారు. బూత్ కన్వీనర్లకు మరింత ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు షాహిద్, పుప్పాల శంకర్,వల్లేపల్లి శ్రీనివాసరావు, కొల్లూరు కిషోర్, భీమా సాయి రెడ్డి, బర్ల మధు, నజీర్, గంధపు పవన్ కుమార్, గిరిజన రాష్ట్ర నాయకులు ప్రతాప్ సింగ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎలమంచిలి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యులు వలియోద్దీన్, హకీం, గంధపు గంగులు, గంధపు రాజు, మిస్స నాగనాథ్ పటేల్, ఇర్వంత్ పటేల్, మృత్యుంజయ, కృష్ణ ప్రసాద్, ఉత్తంకుమార్, శ్రీనివాసరావు, ఆరుగొండ బసవంత్ పటేల్, వహీద్, నీలకంఠ పటేల్, మాజీ ఎంపీటీసీ హనుమంతరావు, డిసిసి సభ్యులు హనుమంతు, శివరాజ్ పటేల్, సోంపూర్ ఎంపీటీసీ లు అనంత విట్టల్, వీరేశం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దత్తు, ఇనుకుర్తి సురేందర్, బబులు, బరిసెట్టి గంగారం, వెంకటి తో పాటు పలు గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular