నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని హెగ్డోలి గ్రామంలో ఇద్దరు వ్యక్తులు అనారోగ్యానికి గురై మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ వారి కుటుంబాలకు 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎంపీటీసీ ఉమా రాంబాబు అందజేశారు. వయసుతో రాజకీయ అనుభవంతో సంబంధం లేకుండా ఉమా రాంబాబు గ్రామంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ ఆపదలో ఉన్న వారి కుటుంబాలలో ధైర్యాన్ని నింపుతున్నారు. కెసిఆర్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయినప్పటికీ తమ వెంట ఉండే కార్యకర్తలకు అండగా నిలబడి తీరుతున్నారు. గ్రామస్తులు ఉమా రాంబాబును అభినందించారు. రాజకీయాల్లో ఎంతోమంది ఎంతో ఎత్తుకు ఎదుగుతారు, మరి కొంతమంది కోట్ల రూపాయలు సంపాదిస్తారు. కానీ సహాయం చేసే గుణం మాత్రం కొందరు మాత్రమే అలవర్చుకుంటారు.
బాధిత కుటుంబాలకు హెగ్ డోలి ఎంపీటీసీ ఆర్థిక సహాయం
RELATED ARTICLES
