జుక్కల్ నియోజకవర్గం మహమ్మద్ నగర్ మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన ఎమ్మెల్యే, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుభాష్ రెడ్డి

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే
తోట లక్ష్మీ కాంతారావు, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు పిలుపునిచ్చారు. మహమ్మద్ నగర్ మండలంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. గతంలో పాలకులు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని తాను అన్ని విధాల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, పేదలకు సంక్షేమ పథకాలను మీ దయచేరుస్తానంటూ ఎమ్మెల్యే తోట ప్రజలకు సందేశం ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించండి మీకు అండగా నేను నిలబడతాను ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
మమ్మద్ నగర్ మండలంలోని సింగీతం, తెల్గాపూర్ గ్రామాలలో శుక్రవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జుక్కల్ కోఆర్డినేటర్ కాసుల బాలరాజ్, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో కలిసి ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని, మహిళలకు ఉచిత ప్రయాణంతోపాటు, 500 కి గ్యాస్ సిలిండర్ అందిస్తూ, గృహ విద్యుత్ ఉచితంగా అందజేస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ ను గెలిపించినట్లయితే జహీరాబాద్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లయ్య గారి ఆకాశ్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
