శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరందరూ నాకు ఆశీస్సులు అందించారు, పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థికి పట్టం కట్టాలి. నారాయణఖేడ్ అభివృద్ధిని తామిద్దరం చూసుకుంటామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.
మనూర్ మండలం లోని ఫంక్షన్ హాల్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం లో శాసన సభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి,
జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షేట్కార్ పాల్గొన్నారు.కార్యకర్తలను ఉద్దేశించి శాసన సభ్యులు, ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ
మనూర్ మండలం నుండి నాకు అత్యధిక మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపిచినందుకు ధన్యవాదాలు , 2014 లో రాష్ట్రమంతటా బి ఆర్ ఎస్ గాలి ఉన్న మా నాన్న ని గెలిపించిన ఘనత మీది , 2016 మా నాన్న కాలం చేసాక హరీష్ రావు నా దగ్గరికి వచ్చి పార్టీ లో చేరమంటే సస్సెమిరా రాను అన్నాను , అలా అనేసరికి మన కార్యకర్తల మీద అక్రమ కేస్ లు పెట్టి అడ్డ దారిలో గెలిచారు.
గత 10 ఏండ్లల్లో మన నియోజకవర్గం అభివృద్ధి కి నోచుకోలేదు ఎక్కడ చూసినా కరప్షన్ , భూ దందా , రౌడీ ఈజమే ఇప్పుడు మనం గెలిచం అన్ని మారుతాయి మారాలి అంతే. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసి పోయింది. అయిన సరే ఖర్చులు తక్కువ చేసుకొని ఇచ్చిన మాట మీద 6 గ్యారంటీల్లో 5 నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ది.మనం గెలిచి 4 నెలలు కాలేదు పథకాల అమలుపై విమర్శలు చేస్తున్న చేస్తున్నారు. నేను సూటిగా అడుగుతున్న మీరు 10 ఏండ్లు ఉండి ఎమ్ చేశారు.ఇక్కడ వ్యవసాయానికి నీళ్లు ఇదిగో ఇస్తా అదిగో ఇస్తాం అన్నారు. చివరికి మొండి చేయి చూపించారు.మొన్ననే మన మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ తో కలిసి పైప్ లైన్ ద్వారా సాగు నీరు అందించే విధంగా ప్రొసీడింగ్ తెచుకున్నాం.రుణమాఫీ పై హరీష్ రావు ఎమ్ అన్నాడు. రుణమాఫీ చేస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు.నేను అంటున్న హరీష్ రావు ని రాజీనామా పత్రాన్ని సిద్ధంగా ఉంచుకో ఈ ఆగస్టు 15 న నా ముఖ్యమంత్రి రుణమాఫీ చేయబోతున్నారు.
మన అభ్యర్థి సురేష్ కుమార్ షేట్కార్ ని అధ్యతిక మెజారిటీ తో గెలిపించి మన సత్తా ఏంటో చూపించాలని ప్రతి నాయకుడు , కార్యకర్త ఒక సైనికుడి లా ముందుకు సాగాలని అన్నారు , ఇక్కడ తోనే అయిపోలే ముందు సర్పంచ్ ఎలక్షన్ లు ఉన్నాయి. వారిని కూడా బంపర్ మెజారిటీ తో గెలిపించాలి.
నారాయణఖేడ్ ని అభివృద్ధి చేయడానికి నేను సిద్ధం , వచ్చే ఎన్నికల్లో మన అభ్యర్థులను గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉండాలని అన్నారు.
కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్, పీసీసీ సభ్యులు శంకరాయస్వామి , అసెంబ్లీ ఇంచార్జ్ శశికళ యాదవ రెడ్డి , మండల అధ్యక్షులు సుభాష్ రావు , మాజీ జడ్పీటీసీ నిరంజన్ , మాజీ సర్పంచ్ డిగంబర్ రెడ్డి , ఎంపీటీసీ సిద్ధ రెడ్డి , ఎంపీటీసీ దొండి రావు , మాజీ సర్పంచులు రాజు , బ్రహ్మానంద రెడ్డి , రామ్ చందర్ , విజయ్, మల్లు పటేల్ మాజీ ఎంపీటీసీ సంగారెడ్డి, సంగు పటేల్, శివ కుమార్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.



