ఐదేళ్లు మీ సేవకుడిగా పని చేస్తా



శాసనసభ ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించినట్లుగానే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆశీర్వదిస్తే తాను ఐదేళ్లపాటు మీ సేవకుడిగా పనిచేస్తానని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. మీరు ఓటు వేశారు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగాను, ఈ సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో శాసనసభలో గళం విప్పుతా, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని వినిపిస్తే తనకు మరింత బలం చేకూరుతుందని ఆ బలంతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి చేయడంతో పాటు పేదలదరి సంక్షేమ పథకాలను చేరుస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పలు గ్రామాల్లో మహిళా మణులు మంగళ హారతులతో ఎమ్మెల్యే తో పాటు కాంగ్రెస్ నాయకులకు దీవెనలు అందించారు.
జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ ఎన్నికల ప్రచారంలో భాగంగా జుక్కల్ నియోజకవర్గంలోని మహ్మద్ నగర్ మండలం సింగీతం,తెల్లాపూర్ గ్రామాలలో మరియు ధూప్ సింగ్ తాండా, గిర్నీ తాండాలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శాసనసభ ఎన్నిక లో తనకు ఓట్లు వేసి గెలిపించినట్లు ఇప్పుడు సురేష్ షెట్కార్ కి కూడా అదేవిధంగా ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గతంలో సురేష్ షెట్కార్ ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ది పనులు చేశాడని, మళ్లీ ఒక్క అవకాశం ఇస్తే మరింత అభివృద్ది చేసుకోవచ్చని తెలిపారు.
తాను సురేష్ షెట్కార్ ని అడిగి మరి నియోజకవర్గానికి కావల్సిన అభివృద్ది పనులు చేయిస్తానని అన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి అయిన సురేష్ షెట్కార్ ని గెలిపిస్తే తనకు మరింత బలాన్ని చేకూర్చిన వారు అవుతారని తద్వారా కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి అభివృద్ది కార్యక్రమాలు చేపడతామన్నారు.
నియోజకవర్గంలోని పోడు భూముల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతలో 3600 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు అయ్యాయని.జుక్కల్ కు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిందని.
ఆగష్టు 15 లోపు రైతులందరికీ రెండు లక్షల వరకు ఏక కాలంలో
రుణమాఫీ చేస్తామని చెప్పారు.ప్రజలందరూ ఆలోచించి అభివృద్ది చేసే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సురేష్ షెట్కార్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమాల్లో ఎమ్మేల్యే తో పాటు తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
