కామారెడ్డి జిల్లాలోని పదవ తరగతి పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెమొంటోలను, కొంత నగదును అందజేసి విద్యార్థులను అభినందించారు.
కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో SSC- 2023-2024 10/10 GPA సాధించిన విద్యార్థులకు అభినందించి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి పట్టణానికే గర్వకారణంగా నిలిచిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. విద్య అభ్యాసంతోనే ప్రతి ఒక్కరి జీవితాలో వెలుగులు నిండుతాయని తల్లిదండ్రుల నమ్మకాన్ని పంపిచేయకుండా ప్రతి ఒక్క విద్యార్థి విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రభుత్వ సలహాదారు విద్యార్థులకు సూచించారు.
పది టాపర్లకు షబ్బీర్ అలీ ఫౌండేషన్ మెమొంటోలు
RELATED ARTICLES
