Tuesday, March 31, 2026

దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

దేశంలో మత తత్వ శక్తులను పెంచి పోషిస్తున్న పార్టీల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించి లౌకిక వాద భావాలు కలిగిన పార్టీలకు ఓటు వేసి దేశాన్ని రక్షించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపునిచ్చారు. హాసన్ పర్తి మండల పరిధిలోని కే.ఎల్.ఎన్ హాసన్ పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బూత్ ఇంఛార్జి మరియు బూత్ కన్వీనర్ ల సమీక్ష సమావేశానికి సహాచర స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి మరియు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య తో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు.

బూత్ ఇంఛార్జిలు, బూత్ కన్వీనర్ సమన్వయంగా పని చేయాలి.రాజకీయాల కోసం గుడిలో ఉండాల్సిన దేవుడిని రోడ్ మీదికి తీస్కొని వచ్చి ఓట్లు అడుగుతున్న బిజెపి పార్టీ కి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు.
ఒక కబ్జాకోర్ను తీసుకొచ్చి వరంగల్ బిజెపి అభ్యర్థిగా నిలబెట్టింది ప్రజలందరికీ బిజెపి పార్టీ అంటే ఏంటో అర్థం అయిపోయింది.పార్టీలో కష్టపడి పని చేసిన ప్రతీ ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుంది.
కొత్త, పాత అనే బేషజాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా పని చేయాలి.
ఈడి, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ తో 10 సం.లు గా చేపిస్తున దాడులను యావత్ భారతదేశం ప్రజానీకం చూస్తుంది.పేదల కోసం పొట్లాడే రాహుల్ గాంధీ మరియు బడ వ్యాపారులకు ప్రజా ధనాన్ని దోచిపెట్టే నరేంద్ర మోడీ కి మధ్య జరుగుతున్న ఎన్నికలు.
కాంగ్రెస్ పార్టీ తోనే ఈదేశ సమగ్ర అభివృద్ధి సాధ్యం.
మోడీ దేవుళ్ళను గుళ్లను నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్ముకుంది.
లక్షల కోట్ల రూపాయలు పేదల దగ్గర పన్నుల పేరుతో వసూలు చేసి కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసిన మోడీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశ ప్రజలందరూ బుద్ధి చెప్పాలనీ ఎమ్మెల్యే నాగరాజు పిలుపునిచ్చారు.
యూపీఏ యూపీఏ ప‌దేళ్ల కాలంలోనే రాహుల్ గాంధీ అనుకుంటే ప్రధానమంత్రి అయ్యేవార‌ని, కానీ ఏనాడూ ఆయ‌న ప‌ద‌విని ప్రేమించలేదు.
ప్రజాస్వామిక వాదులు యువకులు విద్యార్థులు రేపు జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ని ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీ కి తోడుగా పార్లమెంటుకు పంపించాలి.
మ్యానిఫెస్టో లోని 5న్యాయ 25 గ్యారంటీ లను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి.
దళితులు, మైనారిటీ ఓట్లను మనకు అనుకూలంగా మలచుకోవాలి.
దళితులు, క్రిస్టియన్లు, ముస్లింలు ఎప్పుడు కాంగ్రెస్ వైపే ఉంటుంది.
నాయకులు, కార్యకర్తలు ఒక్క ఎంపీ ఏ కాదు సమిటిగా పని చేసి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే మన ప్రధాన లక్ష్యంగా పని చేయాలి.
వర్థన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం రోజురోజుకు పుంచుకుంటుంది.మే 13న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి డాక్టర్ కడియం కావ్య ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. బూత్ కమిటిల సమీక్ష సమావేశం లో టిపిపిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డిసిసిబి బ్యాంక్ చైర్మన్ మర్నెని రవీందర్ రావు, కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలీ వేంకట నర్సింహారెడ్డి, హనుమకొండ ఎస్సీ సెల్ ఛైర్మన్ పెరుమండ్ల రామకృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగెళ్ళపల్లి తిరుపతి తో పాటు మండల గ్రామ స్థాయి నాయకులు యూత్ నాయకులు, మహిళ నాయకురాలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular