Tuesday, June 30, 2026

రైతాంగానికి మద్దతుగా ఢిల్లీలో జరిగిన రైతు పోరాటంలో ఆయన కృషి మరువలేనివి

సిపిఐ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ అతుల్ కుమార్ అంజాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ CPI జాతీయ కార్యదర్శి, మరియు అఖిలభారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి, కామ్రేడ్ అతుల్ కుమార్ అంజన్ అనారోగ్యంతో ఈ రోజు లక్నోలో మరణించారు.

వారు విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా, రైతు సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ బిజెపి రైతాంగానికి వ్యతిరేకంగా తెచ్చిన 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో చేసిన రైతాంగ పోరాటంలో ప్రధాన భూమిక పోషించారని అన్నారు. పార్టీ జాతీయ కార్యదర్శిగా బహుముఖమైన సేవలు అందించారని జాతీయ సమితి నుంచి తెలంగాణ రాష్ట్రానికి నిర్మాణ బాధ్యులుగా కూడా సేవలు అందించారని అన్నారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు కె.రాజన్న, నాయకులు పి.రంజిత్,పి.నర్సింగ్ రావు, ఆనంద్, బాలయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular