Wednesday, March 25, 2026

బాధిత జర్నలిస్టుకు టీయుడబ్ల్యూజే ఆర్థిక సహకారం

మానవత్వాన్ని చాటుకున్న నిజామాబాద్ జిల్లా శాఖ

విరాహత్ అలీ చేతుల మీదుగా సహాయం

జిల్లా జర్నలిస్టుల సంఘానికి అభినందనల వెల్లువ

డయాబేటిక్ ప్రభావంతో కాలును కోల్పోయిన ఓ పేద జర్నలిస్టుకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) నిజామాబాద్ జిల్లా శాఖ అండగా నిలిచి, లక్షా యాభై వేల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించి, మానవత్వాన్ని చాటుకొని ఆదర్శంగా నిలిచింది. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి కేంద్రంగా, దాదాపు 30ఏళ్ళ పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసిన రామకోటి వెంకట్, ఆర్థిక పరిస్థితులు బాగులేక బ్రతుకు దెరువు కోసం హైదరాబాద్ కు వలస వెళ్ళాడు. బోరబండ, గాయత్రీ నగర్ లోని ఓ ఆలయంలో పూజారిగా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మూడు నెలల క్రితం హఠాత్తుగా షుగర్ లెవెల్స్ పెరిగిపోయి రెండు కాళ్ళు ఇన్ఫెక్షన్ కు గురయ్యాయి. చికిత్స సాధ్యం కాకపోవడంతో కూడికాలును తొలగించేసారు. ఇంకో కాలుకు కూడా ప్రమాదం పొంచి ఉందని వైద్యులు తేల్చి చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న టీయుడబ్ల్యూజే నిజామాబాద్ జిల్లా శాఖ, తమ శ్రేయోభిలాషుల నుండి లక్షా యాభై వేల రూపాయల విరాళాన్ని సేకరించి, శుక్రవారం నాడు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ చేతులమీదుగా బాధితుడు రామకోటి వెంకట్ కు ఆర్థిక సహకారాన్ని అందించింది.
జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎడ్ల సంజీవ్, అరవింద్ బాలాజీల నేతృత్వంలో జరిగిన ఈ సహాయ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి సిరిగాద ప్రసాద్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజీవ్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జి. ప్రమోద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల సంఘానికి అభినందనల వెల్లువ

నిజాంబాద్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తన తోటి జర్నలిస్టులకు ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామంటూ ఎంతోమంది ఆపదలో ఉన్న జర్నలిస్టులకు చేతనైన సహాయాన్ని అందిస్తున్నారు. జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్న ఎడ్ల సంజీవ్ జర్నలిజంలో ఎంతో అనుభవం నైపుణ్యం కల వ్యక్తి కావడంతో జిల్లాలోని జర్నలిస్టులకు ఏ ఆపద వచ్చిన తన ఆపదగా భావించి ఆయనతోపాటు జిల్లా జర్నలిస్టుల సంఘం నాయకులు ప్రతి ఒక్కరూ ఎవరివంతు వారు కృషి చేస్తున్నారు. మానవతా దృక్పథంతో ఓ జర్నలిస్ట్ రెండు కాళ్లు కోల్పోయిన మేము అండగా ఉంటాము భయపడవద్దంటూ జర్నలిస్ట్ అనారోగ్యానికి గురి అయినప్పటి నుండి నేటి వరకు జిల్లా జర్నలిస్టుల సంఘం అండగా నిలిచింది. జిల్లా జర్నలిస్టుల సంఘానికి జిల్లాలోని జర్నలిస్టులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా జిల్లాలోని జర్నలిస్టులకు ఏ ఆపద వచ్చిన నిజాంబాద్ జిల్లా జర్నలిస్టుల సంఘం అండగా నిలబడతారని ఎంతోమంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular