ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గణపురం మండలం: సీతారాంపురం గ్రామ పరిధిలో ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (మెపా) ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ ఫైనల్ కీ చేరగా నేడు ముఖ్యఅతిథిగా భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు హాజరై బహుమతులను అందజేయడం జరిగింది. మొదటి బహుమతి ములుగు రెండవ బహుమతి మండల పరిధిలోని కొండాపురం గ్రామానికి అందించారు. అనంతరం మాట్లాడుతూ గెలుపు ఓటమి లను సమానంగా తీసుకోవాలి క్రీడ పోటీల్లో పాల్గొనడం వల్ల స్నేహభావం పెంపొందుతుందని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు అన్నారు. క్రీడలు దేహదారుణ్యానికి దోహదం చేస్తాయన్నారు. అంతేకాకుండా ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడి గెలుపోవటములను సామాన్యంగా స్వీకరించాలని సూచించారు. ఓటమి గెలుపునకు నాంది పలుకుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మెపా జిల్లా అధ్యక్షులు పుట్ట తిరుపతి ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు చాడ కృష్ణస్వామి,జిల్లా ప్రధాన కార్యదర్శి కౌటం రమేష్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్, పిఎసిఎస్ చైర్మన్ కన్నబోయిన కుమార్, గ్రామ కమిటీ అధ్యక్షుడు పిట్ల రంజిత్, జిల్లా ఉపాధ్యక్షులు నరేష్, చెక్క బాబురావు, జిల్లా కోశాధికారి జోడు ఈశ్వర్ ఉప్పరి ప్రవీణ్ ,కోలెపాక నర్సింగరావు, సోషల్ మీడియా ఇన్చార్జి జోడు ప్రదీప్ ముదిరాజ్, పెండ్యాల వెంకటేష్ ముదిరాజ్, మేకల పూర్ణచందర్, మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
