మేడపాటి ఆధ్వర్యంలో పలువురు బిజెపిలో చేరిక



బోధన్ నియోజకవర్గంలో బీ ఆర్ఎస్ పదేళ్లపాటు ఒక వెలుగు వెలుగు ఒకసారి గా చీకట్లు కమ్ముకుంటున్నాయి. బోధన్ నియోజకవర్గ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రెండు పర్యాయాలు గులాబీ పార్టీకి పట్టం కట్టారు. మూడోసారి గులాబీ పార్టీ అభ్యర్థి షకిల్ అమీర్ స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓటమి పాలయ్యారు. ఆనాటి నుండి నేటి వరకు షకీల్ పై కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. బోధన్ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి దిశా నిర్దేశం చేసేవారు కరువయ్యారు. కార్యకర్తలు ఇబ్బందులకు గురవుతున్నారు. శాసనసభ ఎన్నికల నుండి ఇప్పటివరకు ఏనాడు బోధన్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ నేత కాన రావడం లేదు. మరో నాలుగున్నర ఏళ్లు ఏ రకంగా గులాబీ పార్టీలో ఉండాలన్న ఆలోచన ఏదైనా ఇబ్బంది వస్తే మా వెంట ఉండే నాయకుడు ఎవరు అన్న ఆలోచనలు గులాబీ తమ్ముళ్లు కాంగ్రెస్, బిజెపి గూటికి చేరుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మరి ఎంతో మంది కార్యకర్తలు కారు దిగి వెళ్లిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులు ఎవరు గెలుపొందిన, కేంద్రంలో మాత్రం బిజెపి సర్కార్ లేదా కాంగ్రెస్ సర్కార్ మాత్రమే ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. గులాబీ పార్టీలో తమకు భవిష్యత్తు ఉండదన్న ఆలోచనతో బోధన్ నియోజకవర్గ గులాబీ తమ్ముళ్లు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. బోధన్ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీలో ప్రాతినిధ్య వహిస్తున్న మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి లు భారతీయ జనతా పార్టీ బలోపేతానికి వారి వద్ద ఉన్న అస్త్ర శస్త్రాలు అన్ని ఉపయోగిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో సైతం బోధన్ నియోజకవర్గంలో వడ్డీ మోహన్ రెడ్డి పోటీ చేసి 33 వేల పైచిలుకు ఓట్లను సంపాదించారు.
కమలం గూటికి పలువురు చేరిక
బోధన్ నియోజకవర్గ నాయకులు బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి (MPR) ,వడ్డీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందూరు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సమక్షంలో బోధన్ నియోజకవర్గంలోని మదర్న గ్రామ మాజీ సర్పంచ్ గంగాధర్ , అమ్దాపూర్ మాజీ సర్పంచ్ సిర్ప సుదర్శన్ , అమ్దాపూర్ ఉప సర్పంచ్ సంగోజి రాధాకృష్ణ, అమ్దాపూర్ గ్రామస్తులు కుర్మే సురేంధర్ యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాకార్యదర్శి, వార్డ్ మెంబర్ లక్ష్మణ్ గౌడ్, బాబు రావు, శ్రీనివాస్ గౌడ్, గోపీ, కుర్మే హన్మండ్లు, నవత్ సత్యనారాయణ, చింతకుంట సాయిలు, కృష్ణా, సుధాకర్, సురేంధర్ , కృష్ణా, సాయిలు, శేఖర్, సుభాష్ రెడ్డి, ప్రశాంత్, స్వామి, నరేష్, సుధాకర్, సాంబయ్య, రాజేంద్రర్ , శ్రీను, గంగాధర్, రాజు, సురేష్, మహేష్ అధిక సంఖ్యలో బి ఆర్ ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ నుండి భారతీయ జనతా పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, వివిధ మండలాల అధ్యక్షులు ప్రవీణ్, ఇంద్రకరణ్, ఇంద్రకరణ్, మనోహర్, ప్రధాన కార్యదర్శులు జిల్ల కర్ర ప్రవీణ్, సాయినాథ్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు*
