పార్లమెంట్ ఎన్నికల్లో భాగముగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం నిమిత్తం ఉపాధి పనులు నిర్వహిస్తున్న చోటుకు వెళ్లి కూలీల మంచి చెడులను అడిగి తెలుసుకున్నారు.
బోధన్ మండలం ఊట్ పల్లి,అమ్దా పూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పీసీసీ డెలిగేట్ గంగా శంకర్,బోధన్ మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు నాగేశ్వర్ రావు,ఆమ్దా పూర్ మాజీ సొసైటీ చైర్మన్ పోరెడ్డి గంగాధర్ ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు.ఊటుపల్లి గ్రామంలోని ఊర చెరువులో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో పీసీసీ డెలిగేట్ గంగా శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాల్లో 3 పథకాలు అమలు చేశారని మిగతా 3 పథకాలను 15 వ ఆగస్టు లోపు అమలు చేస్తారని వివరించారు.అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టీ.జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.యూపీఏ చైర్ పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ,అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు.ఊటుపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టప్పా సాయిలు నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు దండు డ్రైవర్ సాయిలు,గుండ్ల నరేశ్ లను పీసీసీ డెలిగేట్ గంగా శంకర్ కాంగ్రెస్ పార్టీల్లోకి ఆహ్వానించి కండువా కప్పారు.అనంతరం ఉపాధిహామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టప్పా సాయిలు,డీసీసీ ప్రధాన కార్యదర్శి బొర్ర పల్లన్న,కారేగాం అశోక్ రెడ్డి,బల్లెపు నర్సయ్య,ఖాదర్ పాషా,నరేందర్ గౌడ్,జాయ రాజు,పెద్దసాయన్న ఇస్మాయిల్, జమీల్ తదితరులుపాల్గొన్నారు


